యాప్నగరం

తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్ధానం

Tirumala Temple Ugadi Asthanam నిర్వహించారు. శ్రీవారి మూల విరాట్టు, ఉత్సవ మూర్తులకు నూత వస్త్రాలు. అనంతరం పంచాగ శ్రవణం జరిగింది. అనంతరం బంగారు వాకిలి దగ్గర ఉగాది ఆస్థానం నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించామన్నారు టీటీడీ ఈవో వైవీ సుబ్బారెడ్డి. మరోవైపు బుధవారం ఆర్జిత బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవల్ని టీటీడీ రద్దు చేసింది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 22 Mar 2023, 1:14 pm

ప్రధానాంశాలు:

  • తిరుమల ఆలయంలో ఉగాది ఆస్థానం
  • పంచాగ శ్రమణం నిర్వహించారు
  • ఆర్జిత సేవల్ని రద్దు చేసిన టీటీడీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Tirumala Ugadi Asthanam
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. ఉదయం 7 నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు.. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేశారు.
అనంతరం పంచాగ శ్రవణం నిర్వహించారు.. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంల‌ను టీటీడీ రద్దు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, భక్తులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్ధించానన్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సక్రమంగా పండాలని ప్రార్ధించానని అన్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.