యాప్నగరం

Tirumala లో అనూహ్యంగా పెరిగిన రద్దీ.. దర్శనానికి 30 గంటలపైనే, కారణం ఇదే!

Tirumala Devotees Heavy Rush కనిపిస్తోంది. అనూహ్యంగా రద్దీ పెరగడంతో భారీ క్యూ లైన్లు. దర్శనానికి ఏకంగా 30 గంటలకుపైగా సమయం పడుతోంది. రింగురోడ్డు మీదుగా శిలాతోరణం వరకు.. రెండున్నర కిలోమీటర్ల క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. రద్దీని అర్ధం చేసుకుని భక్తులు ఓపికగా ఉండి స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీ కోరింది. బ్రహ్మోత్సవాల తర్వాత ఒక్కసారిగా రద్దీ పెరిగింది. గదులు, కళ్యాణ కట్టలు, లడ్డూ కౌంటర్లు, అన్న ప్రసాద భవనం దగ్గర రద్దీ కనిపిస్తోంది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 7 Oct 2022, 5:55 am

ప్రధానాంశాలు:

  • తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ
  • శిలా తోరణం వరకు క్యూ లైన్లు ఉన్నాయి
  • 30 గంటలకుపైగా సమయం పడుతోంది
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Tirumala Devotees Heavy Rush
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సెలవులు ముగుస్తున్నా సరే భక్తులు కొండపైకి క్యూ కట్టారు. తిరుమల ఒక్కసారిగా కిటకిటలాడింది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి ఉద్యానవనం షెడ్లూ నిండిపోయి. రింగురోడ్డు మీదుగా శిలాతోరణం వరకు.. రెండున్నర కిలోమీటర్ల పొడవునా భక్తులు క్యూ కట్టారు. తిరుమల శ్రీవారి దర్శనానికి 30 గంటలకుపైగా సమయం పడుతోందని.. ర‌ద్దీ స‌మ‌యంలో భ‌క్తులు ఓపిక‌తో ఉండాలని టీటీడీ కోరుతోంది.
ముఖ్యంగా తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి గురువారం భక్తులు భారీగా తరలివచ్చారు. పెరటాసిమాసం మూడో శనివారంతోపాటు వరుస సెలవులు రావడంతో తమిళనాడునుంచి భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి శిలాతోరణం దాటి క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అనూహ్యంగా రద్దీ పెరిగడంతో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి క్యూ లైన్లను పరిశీలించారు. భక్తులు సహకరించాలని ఓపికతో ఉండాలని.. అందరికి అన్న ప్రసాదాలు అందజేస్తామంటున్నారు టీటీడీ అధికారులు.

ఈ రద్దీ పెరగడానికి ప్రధానంగా తమిళులకు పవిత్రమైన పెరటాశి మాసం కారణం అంటున్నారు. సర్వదర్శనానికి బాగా సమయం పడుతోంది. గదుల కోసం నాలుగైదు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కళ్యాణ కట్టలు, లడ్డూ కౌంటర్లు, అఖిలాండం, అన్నప్రసాద భవనం సహా ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. మరోవైపు తిరుమలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా భక్తులు తలనీలాలు ఇచ్చే కళ్యాణ కట్టలో వరద నీరు నిలిచిపోయాయి.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.