యాప్నగరం

చిత్తూరు: ఫేస్‌బుక్‌‌లో ప్రేమ, ఫోటోలు లేకుండా.. ప్రియురాలి మోసాన్ని తట్టుకోలేక!

ఫేస్‌బుక్‌లో ఇద్దరి మధ్య ప్రేమ. యువతి ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ ఫొటోలు మినహా.. ఆమెను యువకుడు ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. కానీ ప్రేమ వ్యవహారం పెళ్లివరకూ వచ్చింది.

Samayam Telugu 7 Jan 2021, 9:03 am
ఫేస్‌బుక్ ప్రేమలు విషాదంతమవుతున్నాయి. కొంతమంది ట్రాప్‌లో పడి యువకులు ప్రాణాలు తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటన సంచలనం రేపుతోంది. పలమనేరు పల్లె వీధికి చెందిన హరి ఎస్టేట్‌లోని మగ్గాల పరిశ్రమలో కూలి పనికి వెళ్లేవాడు. అతికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో స్నేహం చేశాడు. కొంతకాలంగా ఇద్దరి మధ్య ఆన్‌లైన్‌ చాటింగ్‌ నడుస్తోంది.. అది ప్రేమగా మారి హరి ప్రియురాలికి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత కొద్దిరోజులు అతడితో చాట్ చేయలేదు.
Samayam Telugu చిత్తూరు జిల్లా


ఆలస్యంగా స్పందించిన ప్రియురాలు ఇటీవలే కుదరదని తేల్చి చెప్పింది. ప్రేమించిన యువతి కాదనడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. మంగళవారం రాత్రి తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీ నుంచే లైవ్‌ చాట్‌ చేస్తూ మెడకు ఉరి వేసుకుని సెల్ఫీ తీసుకున్నాడు. ఆ సెల్ఫీని ప్రియురాలికి పంపాడు.. అయినా ఆమె స్పందించకపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం బుధవారం కార్మికుల గమనించారు.

హరి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. యువతి ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్‌ ఫొటోలు మినహా.. ఆమెను యువకుడు ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. కానీ ప్రేమ వ్యవహారం పెళ్లివరకూ వచ్చింది. పెళ్లికి ప్రేమికురాలు నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. ఫేస్‌బుక్‌లో కొంతమంది మోసం చేస్తున్నారని.. యువత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.