యాప్నగరం

కృష్ణా జిల్లాలో పేకాట డెన్‌ గుట్టురట్టు...30 మంది అరెస్ట్.. రూ.కోట్లలో నగదు సీజ్

కృష్ణా జిల్లాలోని నందివాడ మండలం తమిరశ గ్రామంలో గుట్టుగా పేకాట ఆడుతున్న 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.కోట్లలో నగదు స్వాధీనం చేసుకున్నారు.

Samayam Telugu 4 Jan 2021, 7:29 am
కృష్ణా జిల్లాలో గుట్టుగా కొనసాగుతున్న పేకాట స్థావరాన్ని పోలీసులు ఆదివారం రట్టు చేశారు. నందివాడ మండలంలోని తమిరశ గ్రామంలో ఆదివారం రాత్రి దాడులు నిర్వహించిన ఎస్ఈబీ అధికారులు 30 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. 28 కార్లతో పాటు కోట్లాది రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. గుడివాడ రూరల్‌, నందివాడ మండలాల్లోని చేపల చెరువులే కేంద్రంగా ఈ శిబిరాలు నడుస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ధనవంతులు ఇక్కడికి వచ్చిన పేకాటలో మునిగి తేలుతున్నారని, నిర్వాహకులు వారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు.
Samayam Telugu Image


Also Read: న్యూ ఇయర్ వేడుకల్లో అక్కాచెల్లెలిపై రేప్.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో దారుణం

కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే పేకాట రాయుళ్లకు ఓ కన్వెన్షన్ హాల్‌లో నిర్వాహకులు బస ఏర్పాటు చేసి, అక్కడి నుంచి పేకాట శిబిరాలకు తరలిస్తున్నట్లు వాహనాల్లో తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటికి పొక్కకుండా ఓ రోజు ఒక చోట ఏర్పాటుచేసే శిబిరం మరుసటి రోజు అక్కడ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పేకాట ఎప్పుడు, ఎక్కడ జరిగేదీ ఆడేవారికి కూడా ముందుగా తెలియదు. పేకాట ఆడేందుకు కేటగిరీలను బట్టి ఎంట్రీ ఫీజు కూడా వసూలు చేస్తున్నారట. ఈ దందాతో పేకాట నిర్వాహకులకు రోజుకు రూ.లక్షల్లో కమిషన్ వస్తున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.