యాప్నగరం

Vijayawada: జగన్ తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే.. సీన్ వేరేలా ఉంటది: బైరెడ్డి

Vijayawada: వైఎస్సార్సీపీ యువనేత, శాప్ ఛైర్మన్ బెరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఏపీలో ఏం చేస్తుందో తెలియదు గానీ.. జగన్ తెలంగాణలో వేలు పెడితే.. అక్కడి ప్రభుత్వమే తలకిందులు అవుతుందని వ్యాఖ్యానించారు. బైరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఆయన ఏ ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేశారనే చర్చ జరుగుతోంది. అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై కూడా బైరెడ్డి ఫైర్ అయ్యారు. లోపాయికారి ఒప్పందం ఉంది కాబట్టే.. వారిద్దురు కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 18 Jan 2023, 6:49 pm

ప్రధానాంశాలు:

  • బెరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలన కామెంట్స్
  • జగన్ తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే..
  • అక్కడి ప్రభుత్వం తలకిందులవ్వుద్దని వ్యాఖ్య
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Byreddy Siddharth Reddy
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి
Vijayawada: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే.. అక్కడి ప్రభుత్వమే తలకిందులు అవుతుందని.. వైఎస్సార్సీపీ యువనేత, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. జగన్ ఎవరు ఏం మాట్లాడిన ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జగన్ కొన్ని లక్షల కుటుంబాలకు మేలు చేశారు. ప్రభుత్వంలో ఉన్నా.. లేకున్నా.. ఆయన అనేక కుటుంబాలకు సాయం చేశారు.. అందుకే మేమంతా ఆయనకు సైన్యంగా పని చేస్తున్నాం.. తెలంగాణలోనూ జగన్ అభిమానులు లక్షల మంది ఉన్నారని Byreddy Siddharth Reddy వ్యాఖ్యానించారు.
'తెలంగాణలోని ప్రతీ గ్రామంలో జగన్‌కు సైన్యం ఉంది. కానీ.. అక్కడ తెలంగాణ మంత్రులు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. ఏపీకి బీఆర్ఎస్ వస్తది.. చించుతది అని చెబుతున్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చి ఏం చించుతారో.. ఏం పొడుస్తారో నాకు తెలియదు గానీ.. జగన్ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడితే.. అక్కడున్న ప్రభుత్వాలే తలకిందులు అవుతాయి. అది ఆయన పవర్. ఈ విషయం తెలుసుకొని ఎవరైనా జగన్ (YS Jagan) గురించి మాట్లాడితే బాగుంటుంది' అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పైనా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సెటైర్లు వేశారు. 'పవన్ కళ్యాణ్‌కు 175 నియోజకవర్గాల పేర్లు తెలుసా.. కనీసం కొత్తగా ఏర్పడినా జిల్లాల పేర్లు అయినా తెలుసా. జగన్ నమ్ముకొని వేలాది మంది మంచి మంచి స్థానాల్లో కూర్చొని ఉన్నారు. పవన్‌ను నమ్ముకొని రాజకీయం చేస్తే.. రోడ్డున పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అప్పుల పాలయ్యారు. పవన్ కోసం పనిచేసే కార్యకర్తలు.. ఎన్నికల సమయంలో.. చంద్రబాబు కోసం పనిచేయాల్సి వస్తోంది' అని సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యానించారు.

'హైపర్ ఆది (Hyper Aadi) వంటివారు ఏమైనా మాట్లాడొచ్చు. ఎవరికైనా మద్దతు తెలపొచ్చు. ఎవ్వరినీ తప్పుపట్టడం లేదు. మేము వ్యతిరేకించేది వారి నాయకుడినే. పవన్ కళ్యాణ్‌ది రంగం సినిమాలో లాగా విలన్ టైపు రాజకీయం. పొద్దుల లేచి ఉద్యమం, పోరాటం అని చెప్పే పవన్.. రాత్రి వెళ్లి మళ్లీ చంద్రబాబుతో కలిసి రాజకీయం చేస్తారు. లోపాయికారి ఒప్పందం ఉంది కాబట్టే.. చంద్రబాబు, పవన్ కలిసి రాజకీయం చేస్తున్నారు. వారిని ఎదుర్కోవడానికే జగన్‌కు ప్రైవేట్ సైన్యం ఉందని చెప్పాను. ప్రైవేట్ సైన్యం అంటే వారు అనుకునేది కాదు. జగన్ కూడా అలాంటి దాన్ని ఎంకరేజ్ చేయరు' అని సిద్ధార్థ రెడ్డి స్పష్టం చేశారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.