యాప్నగరం

Vijayawada: దుర్గ గుడి ఉద్యోగి చంద్రశేఖర్ బూతు పురాణం.. చెవులు మూసుకోవాల్సిందే!

Vijayawada: అది పవిత్రమైన అమ్మవారి దేవాలయం. అక్కడ ఉన్నత స్థాయిలో విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగి ఆయన. కిందిస్థాయి సిబ్బందితో సఖ్యతగా ఉంటూ.. భక్తులకు సేవలు అందించాల్సిన బాధ్యత ఆయనది. కానీ.. అవన్నీ మర్చిపోయి బూతు పురాణం మొదలుపెట్టారు. మాటల్లో చెప్పలేని.. రాతల్లో రాయలేని బూతులతో రెచ్చిపోయారు. దీంతో అక్కడి సిబ్బంది చెవులు మూసుకున్నంత పని చేశారు. చుట్టుపక్కల ఉన్న భక్తులు కూడా సదరు ఉద్యోగి తీరుపై ఆసహనం వ్యక్తం చేశారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 23 Mar 2023, 7:12 pm

ప్రధానాంశాలు:

  • దుర్గగుడి ఏఈవో చంద్రశేఖర్ బూతు పురాణం
  • టోల్ గేట్ సిబ్బందిపై రెచ్చిపోయిన ఉద్యోగి
  • చెప్పుతో కొడతా అంటూ సిబ్బందిపై ఏఈవో ఫైర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Employee Chandrasekhar
ఉద్యోగి చంద్రశేఖర్
Vijayawada: పవిత్రమైన దుర్గమ్మ ఆలయంలో పని చేస్తున్న ఉద్యోగి చంద్రశేఖర్.. బూతులు తిడుతూ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు దుర్గ గుడిలో.. ఉద్యోగి చంద్రశేఖర్ బూతు పురాణం చర్చనీయాంశంగా మారింది. చెప్పుల స్టాండ్ మార్చిన సందర్భంగా.. కంప్యూటర్ లేదు అని సిబ్బంది చెప్పారు. దీంతో.. కంప్యూటర్ లేకపోతే పని చెయ్యరా అని చంద్రశేఖర్ (Chandrasekhar) ఫైర్ అయ్యారు. మాటల్లో చెప్పలేని బూతులు తిట్టారు. చంద్రశేఖర్ తీరుతో.. కింది స్థాయి సిబ్బంది కన్నీరు పెట్టుకుంటున్నారు.
మరోవైపు Kanaka Durga Temple టోల్ గేట్‌లో పని చేసే సిబ్బంది పైనా చంద్రశేఖర్ నోరు పారేసుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఒకరు.. కళ్లు తిరిగితే.. టోల్ గేట్ సిబ్బంది కూర్చొబెట్టారు. వారిని చూసిన చంద్రశేఖర్.. వారి దగ్గర ఎంత తీసుకున్నావ్.. వారిని ఎందుకు కూర్చోబెట్టావ్ అని ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా.. బండబూతులు తిట్టారు. ఎంతో పవిత్రమైన అమ్మవారి ఆలయంలో పని చేస్తూ.. ఇలాంటి బూతులు తిట్టడం ఏంటని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.