యాప్నగరం

హైదరాబాద్‌ను కోల్పోయాం.. మళ్లీ ఆ తప్పు జరగొద్దు: కొడాలి నాని

Kodali Nani ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో అక్కడి జనాలు ఉన్నారని.. అందుకే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. దేవుళ్లు, ప్రజలు హర్షించరూ అంటూ వ్యాఖ్యానించారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 6 Oct 2022, 8:35 am

ప్రధానాంశాలు:

  • కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
  • హైదరాబాద్‌ను కోల్పోయామన్న మాజీ మంత్రి
  • మరోసారి ఆ తప్పు జరగొద్దన్న కొడాలి నాని
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Kodali Nani
హైదరాబాద్‌ను కోల్పోయి అనాథలమయ్యామని.. మరోసారి ఆ తప్పు జరగొద్దంటున్నారు మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani). రాష్ట్ర సంపద అంతా ఒకే చోట పెడితే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని కొండాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వికేంద్రీకరణ మూడు రాజధానులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అమరావతి ఉద్యమాన్ని దేవుళ్లు, ప్రజలు హర్షించరని వ్యాఖ్యానించారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు వెనుకబడి ఉన్నారని.. రాష్ట్ర సంపదంతా ఒకే చోట పెడితే ప్రాంతీయ విద్వేషాలు వస్తాయన్నారు నాని. ప్రజల కష్టాన్ని ఒకే చోట పెడితే హైదరాబాద్‌ పరిస్థితే వస్తుందని.. కులాలు, పార్టీల కోసం కాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేయకూడదనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు.

రెక్కాడితే గాని, డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల కోసమే మూడు రాజధానుల నిర్ణయం అన్నారు. కులాలు, పార్టీల కోసమో కాక, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ద్రోహం చేయకూడదనే ఆ దిశగా ముఖ్యమంత్రి జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారన్నారు. శ్రమంతా అమరావతికే పెడితే తిరిగి అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.