యాప్నగరం

కృష్ణా: పెట్రోల్ పోసుకుని పోలంలోనే నిప్పంటించుకున్న రైతు.. మొండోడిని, వైసీపీ అభిమానిని అంటూ సీఎం జగన్‌కు లేఖ

తాను మొండి వ్యక్తినని.. ఇప్పుడు ఇక్కడ తన చావును ఎవరు ఆపుతారు అని లేఖలో ప్రస్తావించాడు. వైయస్సార్ పార్టీ అభిమానిని అంటూ కౌలు రైతు కష్టాలు తనకు తెలుసంటూ లేఖ‎లో ప్రస్తావించాడు.

Samayam Telugu 20 Jan 2021, 12:23 pm
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. చందర్లపాడులో తాను పండించిన పోలంలోనే రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కట్టా లక్ష్మీ నారాయణ అనే రైతుకు ఇద్దరు పిల్లలు.. నారాయణ వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కౌలుకు 28 ఎకరాలు పొలం తీసుకున్నాడు. పంట సరిగ్గా చేతికి రాకపోవడంతో.. మానసిక ఒత్తిడికి గురయ్యాడు. తాను చేసిన అప్పుల్ని ఎలా తీర్చాలని ఆవేదన చెందాడు. ఆ బాధను భరించలేక లక్ష్మీనారాయణ తన పంట పొలంలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
Samayam Telugu రైతు ఆత్మహత్య


తాను ఆత్మహత్య చేసుకునే ముందు ఓ లెటర్ రాసాడు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గారు.. పత్తి యార్డులో చావాలని 25 నిద్రమాత్రలు మింగాను.. అయినా తాను చావలేదని.. తనకవాత అన్ని వివరాలతో లెటర్స్ రాసాను అన్నాడు. కుటుంబ సభ్యులు దాచినారో, చించినారో తనకు తెలియదని.. తాను మొండి వ్యక్తినని.. ఇప్పుడు ఇక్కడ తన చావును ఎవరు ఆపుతారు అని లేఖలో ప్రస్తావించాడు. వైయస్సార్ పార్టీ అభిమానిని అంటూ కౌలు రైతు కష్టాలు తనకు తెలుసంటూ లేఖ‎లో ప్రస్తావించాడు.

రైతు ఆత్మహత్యపై ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలకు 753 మంది రైతులు బలైపోయారని ఆరోపించారు. అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని.. ఇన్స్యూరెన్స్ కట్టడం దగ్గర నుండి మద్దతు ధర కల్పించడం వరకూ రైతుల్ని జగన్ ఘోరంగా మోసం చేసారన్నారు.

కృష్ణా జిల్లా,చందర్లపాడులో అప్పుల బాధ భరించలేక మనస్తాపంతో రైతు కట్టా లక్ష్మీనారాయణ పొలంలోనే ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమన్నారు లోకేష్. దేశానికి అన్నం పెట్టే అన్నదాతల ఆత్మహత్యలు చూస్తుంటే కంట కన్నీరు ఆగడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ అభిమాని అయిన కౌలు రైతు లక్ష్మీనారాయణ.. జగన్ రెడ్డి పాలనలో కౌలు రైతులు పడుతున్న కష్టాన్ని వివరిస్తూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మోసపూరిత ప్రకటనలు వీడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
https://twitter.com/naralokesh/status/1351751849481670656

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.