యాప్నగరం

విజయవాడ: గన్నవరంలో విమాన సర్వీసులకు అంతరాయం

వేకువజాము నుంచే దట్టంగా కురుస్తున్న పొగమంచులో ఎదురుగా ఏముందో కనిపించని పరిస్థితి ఉంది. ఉదయం 7.20 గంటలకు రావాల్సిన ఢిల్లీ, బెంగళూరు సర్వీసులు రెండు గంటలు అలస్యం అయ్యాయి.

Samayam Telugu 14 Jan 2021, 11:01 am
గన్నవరం ఎయిర్ పోర్టులో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం ఉదయం రావాల్సిన పలు విమాన సర్వీసులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వేకువజాము నుంచే దట్టంగా కురుస్తున్న పొగమంచులో ఎదురుగా ఏముందో కనిపించని పరిస్థితి ఉంది. ఉదయం 7.20 గంటలకు రావాల్సిన ఢిల్లీ, బెంగళూరు సర్వీసులు రెండు గంటలు అలస్యం అయ్యాయి. వాతావరణం అనుకూలించిక పోవడంతో గన్నవరం చేరుకున్న స్పైస్‌ జెట్‌, ఇండిగో విమానాలు దాదాపు అరగంట పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాయి.
Samayam Telugu గన్నవరం ఎయిర్‌పోర్ట్


అటు బుధవారం కూడా మంచు దెబ్బకు కొన్ని విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావాల్సిన విమానాలను దారి మళ్లించారు. కొన్ని విమానాలు బెంగళూరుకు పంపించారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పరిస్థితులన్నీ చక్కబడ్డాక మాత్రమే విమానాలను ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.