యాప్నగరం

విజయవాడ: ఎలుకలు తోసేయడంతోనే సీతమ్మ విగ్రహం పడిపోయిందట!

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు పరంపర ఆగడం లేదు. తాజాగా రామతీర్థం వివాదం సద్దుమణగక ముందే.. రాష్ట్రంలోని మరికొన్ని చోట్ల దేవతా విగ్రహాల ధ్వంసం జరుగుతోంది.

Samayam Telugu 3 Jan 2021, 1:03 pm
ఆంధ్రప్రదేశ్‌లో దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం ఘటనల పరంపర కొనసాగుతూనే ఉంది. విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం శిరచ్ఛేదం ఘటన మరువక ముందే రాజమండ్రిలో సుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహానికి రెండు చేతులను దుండగులు విరగ్గొట్టారు. తాజాగా విజయవాడలో మరో ఘటన చోటు చేసుకుంది. పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు సమీపంలో ఉన్న సీతారామమందిరంలో అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
Samayam Telugu విజయవాడ విగ్రహం ధ్వంసం


హిందూ ఆలయాలు, దేవతా విగ్రహాల ధ్వంసం ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చి 24 గంటలైనా గడవక ముందే విజయవాడ నడిబొడ్డున, మంత్రి సొంతూరులోనే సీతమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఈ పనిచేశారా? లేక కిందపడి విగ్రహం పగిలిపోయిదా? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇది మట్టితో తయారుచేసిన విగ్రహమని, ఎలుకలు లేదా గాలికి కిందపడి ధ్వంసమై ఉంటుందని సీఐ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఘటనా స్థలికి చేరుకున్న టీడీపీ నేత పట్టాభిరామ్‌ ఆగ్రహాం వ్యక్తం చేశారు. దర్యాప్తు చేయకుండా ఎలా నిర్థారణకు వస్తారని ప్రశ్నించారు. సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అటు, కర్నూలు జిల్లా కోసిగి సమీపంలోని మర్లబండ ఆంజనేయస్వామి ఆలయంలోని సీతారాముల విగ్రాహాలను కూడా దుండగులు శనివారం ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. గుడి ముఖద్వారం ఇనుప ఊచలను తొలగించి హుండీని ఎత్తుకుపోయారు. అయితే, పోలీసులు మాత్రం అక్కడి పరిస్థితులను తారుమారు చేశారు. విగ్రహం ధ్వంసం కాలేదని నిరూపించేందుకు యత్నించారు. అక్కడికి వెళ్లిన విలేకరులు, పూజారిని నిర్బంధించి, అర్ధరాత్రి వారిని బయటకు విడిచిపెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.