విజయవాడ జనసేన పార్టీ నేత పోతిన వెంకట మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వెల్లంపల్లి మాయలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పడ్డారని.. అవినీతి మంత్రి మాయలో మోసపోవద్దని సూచించారు. విజయవాడ పశ్చిమంలో దుర్గా కోపరేటివ్ బ్యాంకులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని.. ఎంక్వైరీ పూర్తి చేసి కోపరేటివ్ కోర్టులో గత పాలకమండలిపై విచారణ కూడా జరుగుతోందన్నారు. చీరాల వేటపాలెం కోపరేటివ్ సొసైటీలో అవకతవకలు జరిగాయని పేపర్లో వస్తేనే ఎంక్వైరీ వేశారన్నారు మహేష్. మరి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో మిలాకత్ అయ్యి.. నిబంధనలు పట్టించుకోరా అని ప్రశ్నించారు. విజయవాడ పశ్చిమం దుర్గా కోపరేటివ్ బ్యాంకులో అవకతవకలపై ఆరా తీయాలన్నారు. ఈ సమయంలో ముగ్గురు ప్రభుత్వ అధికారుల పాలనను ఎలా రద్దు చేశారని ప్రశ్నించారు. పోతిన మహేష్ మంత్రి వెల్లంపల్లిపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ఆ మంత్రి మాయలో పడొద్దు మంత్రి కన్నబాబు గారు.. జనసేన పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు
ఆ మంత్రి మాయలో పడొద్దంటున్న జనసేన పార్టీ నేత. మంత్రి కన్నబాబుకు సూచనలు చేసిన పోతిన మహేష్. అవినీతి మంత్రి మాయలో మోసపోవద్దంటూ సలహాలు..
Samayam Telugu 26 Jul 2021, 2:37 pm
ప్రధానాంశాలు:
- వేటపాలెం సరే విజయవాడ సంగతేంటి
- ఆ మంత్రి మాయలో పడొద్దన్న మహేష్
- మంత్రిపై జనసేన పార్టీ నేత వ్యాఖ్యలు