యాప్నగరం

బస్సు బ్రేకులు ఫెయిల్.. లోపల 40 మందికి పైగా.! విజయవాడ హైవేపై ఘోర ప్రమాదం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిలైన బస్సు అమాంతం దూసుకెళ్లి లారీ ట్యాంకర్‌ని ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 40 మందికిపైగా ప్రయాణికులున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Samayam Telugu 18 Jul 2021, 6:11 pm
కృష్ణా జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బస్సు ముందు వెళ్తున్న లారీ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి సమీపంలోని పిన్నమనేని సిద్ధార్థ కళాశాల వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అమాంతం లారీ ట్యాంకర్‌ని ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో 40 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. బస్సు ఢీకొన్న ధాటికి ప్రయాణికులు చెల్లచెదురుగా పడిపోయారు. సుమారు 40 మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయని.. పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


స్థానికులు స్పందించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను అంబులెన్సులు, ఆటోల్లో ఆస్పత్రికి తరలించారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని.. అందువల్లే ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతున్నారు. బ్రేకు వేసిన పడకపోవడంతోనే ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టిందని డ్రైవర్ చెప్పినట్లు సమాచారం. ప్రమాద ఘటనతో కోల్‌కతా చెన్నై జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు స్పాట్‌కి చేరుకుని ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరించారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.