యాప్నగరం

భార్యని అర్ధరాత్రి రోడ్డుపై పరిగెత్తించి.. గుంటూరులో భర్త ఘాతుకం

పండుగ రోజు స్నేహితులతో కలసి ఫుల్లుగా మద్యం తాగి ఇంటికెళ్లాడు భర్త. అది నచ్చిన భార్య గట్టిగా నిలదీయడంతో పశువులా మారి పైశాచికంగా ప్రవర్తించాడు.

Samayam Telugu 16 Jan 2021, 1:44 pm
పెళ్లైన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడి.. భర్తను వదిలేసి మరీ రెండో పెళ్లి చేసుకుంది. సాఫీగా సాగిపోతున్న సంసారంలో చిచ్చురేగింది. భర్త మద్యం తాగి రావడం భరించలేక భార్య గొడవపడడం మొదలుపెట్టింది. చివరికదే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. మద్యం మత్తులో ఉన్న భర్త అర్ధరాత్రి రోడ్డుపై పరిగెత్తించి మరీ కత్తితో విచక్షణా రహితంగా పొడిచేశాడు. ఈ అత్యంత దారుణ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
murder attempt


సత్తెనపల్లి పట్టణంలోని భావనారుషి నగర్‌కి చెందిన ఆముదాల వెంకట గోపీనాథ్ గుమాస్తాగా పనిచేసేవాడు. పెళ్లైన మహిళతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రియుడి మాయలో పడిపోయిన వివాహిత భర్తను వదిలేసి గోపినాథ్‌ని నాలుగేళ్ల కిందట రెండో పెళ్లి చేసుకుంది. వారికి ఓ కూతురు సంతానం. సాఫీగా సాగిపోతున్న కాపురంలో కలహాలు రేగాయి. భర్త మద్యం తాగి రావడం నచ్చని భార్య తరచూ గొడవపడేది. అదే విషయమై ఇద్దరూ గొడవపడేవారని తెలుస్తోంది.

కనుమ పండుగ రోజు స్నేహితులతో కలిసి ఫుల్లుగా తాగొచ్చిన గోపినాథ్‌ని భార్య నిలదీసింది. దీంతో ఆగ్రహం చెందిన భర్త కూరగాయలు కోసే కత్తి తీసుకుని ఆమె వెంటపడ్డాడు. అర్ధరాత్రి రోడ్డుపై పరిగెత్తించి మరీ దారుణంగా పొడిచేశాడు. విచక్షణా రహితంగా 18 కత్తిపోట్లు పొడిచాడు. తీవ్రగాయాలపాలైన భార్యను స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.