యాప్నగరం

పామును పట్టుకునేందుకు వెళ్లిన అర్చకుడు.. అయ్యో పాపం ప్రాణాలు పోయాయి

Kruthivennu Priest తీవ్ర విషాదాన్ని నింపింది. పామును పట్టుకోవడానికి వెళ్లిన అర్చకుడు.. ఆ పాము కాటుకే బలి అయ్యారు. పామును పట్టుకుని దూరంగా వదిలేస్తున్న సమయంలో కాటు వేసింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 26 Sep 2022, 8:40 am

ప్రధానాంశాలు:

  • కృత్తివెన్ను
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Krishna District
కృష్ణా జిల్లాలో దారుణం ఘటన జరిగింది. పామును పట్టుకోవడానికి వెళ్లిన అర్చకుడు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. పట్టుకున్న పాము కాటు వేయడంతో కన్నుమూశారు. కృత్తివెన్ను గుడిదిబ్బకు చెందిన కొండూరి నాగబాబుశర్మ వారసత్వంగా పౌరహిత్యాన్ని తీసుకున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. దసరా కావడంతో సొంత ఊరికి వచ్చారు. ఈ క్రమంలో గ్రామాల్లో కనిపించే పాములను పట్టుకుని నివాసాలకు దూరంగా వదిలివేస్తుంటారు.
ఇతంలో కృత్తివెన్ను పీతలావకు చెందిన రైతులు మధ్యాహ్నం పామును పట్టుకోవడానికి కొండూరు నాగబాబుశర్మను పిలిచారు. ఆయన చాకచక్యంగా పామును పట్టుకున్నారు. ఈ క్రమంలో పామును ఇళ్లకు దూరంగా తరలించే సమయంలో చేతిపై కాటు వేసింది. ఆయన ఇంటి దగ్గరే ప్రథమ చికిత్స చేయించుకున్నారని కుటుంబ సభ్యులు చెప్పాు. కొంతసేపటికి శర్మ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరిస్థితిని గమనించి మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం తీసుకువెళ్లారు.

శర్మను కుటుంబ సభ్యులు కారులో మచిలీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు చికిత్స చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమందిని పాముకాటు బారినుంచి రక్షించిన వ్యక్తి.. ఇప్పుడు పాము కాటుతో చనిపోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి. స్థానికులతో పాటు పరిసర గ్రామాల జనాలు నాగబాబుశర్మకు నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.