యాప్నగరం

సెల్‌ఫోన్‌లలో సమాధానాలు.. ఆరుగురు టీచర్లు అడ్డంగా బుక్.. వెంటనే సస్పెండ్..!

కృష్ణా జిల్లా పసమర్రులో పదో తరగతి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఆరుగురు టీచర్లను సస్పెండ్ చేసినట్లు డీఈఓ తాహిరా సుల్తానా తెలిపారు. టీచర్ల సెల్‌ఫోన్లలో ప్రశ్నలకు సంబంధించి ఆన్సర్లు లభించాయని.. వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించామని చెప్పారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 2 May 2022, 3:55 pm
ఏపీలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం ఎంతో పగడ్బందీగా నిర్వహిస్తున్నా.. కొందరు టీచర్లు చేస్తోన్న చర్యలతో పరీక్షల ప్రశ్నపత్రాలు బయటకు వస్తున్నాయి. ఎక్కడికక్కడ టీచర్లను సస్పెండ్ చేస్తూ.. కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇంకా కొంతమంది బుద్ధి మారడంలేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనో.. లేదా తమ విద్యార్థులకు అధిక మార్కులు తెప్పించుకోవాలన్న దుర్భుద్దో తెలియదు కానీ.. ఏపీలో నిత్యం పేపర్ లీక్ వార్తలు కలకల రేపుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఆరుగురు టీచర్లను అధికారులు సస్పెండ్ చేశారు.
Samayam Telugu విచారణ చేపట్టిన అధికారులు


గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు జడ్పీ హైస్కూల్‌లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడినట్లు అధికారులకు సమాచారం అందింది. సమీపంలో ఉన్న పామర్రు మండలం పసమర్రు జడ్పీ హైస్కూల్ నుంచి క్వశ్చన్ పేపర్స్, ఆన్సర్లను పరీక్షా కేంద్రానికి చేరవేస్తున్నట్లు టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఉన్నతాధికారులు, పోలీసులు పసమర్రు పరీక్షా కేంద్రం వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు.

టీచర్ల సెల్‌ఫోన్లను చెక్ చేయగా.. నేడు జరుగుతున్న ప్రశ్నపత్రానికి సంబంధించిన జవాబులు కనిపించాయి. పసుమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదుగురు టీచర్లు, స్కూల్‌ అసిస్టెంట్లు మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు గుర్తించామని డీఈఓ తాహిరా సుల్తానా తెలిపారు. టీచర్ల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు చెప్పారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఆరుగురు టీచర్లను సస్పెండ్ చేశామని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.