యాప్నగరం

విజయవాడ: గోల్డ్ షాపులో ఈ ఇద్దరు మహిళలు ఎంత ఈజీగా చోరీ చేశారో చూడండి.. వీడియో వైరల్

Kondapalli Gold Shop Theft కలకలంరేపింది. ఇద్దరు మహిళలు కస్టమర్లలో షాపులోకి వచ్చారు. అర్జంటుగా ఫంక్షన్‌కు వెళ్లానలి తమకు ఆభరణాలు కావాలని అడిగారు. షాపు యజమాని నగలు తీసి బయట పెట్టారు.. ఆ ఇద్దరు మహిళలు తీసుకుని చూడటం మొదలు పెట్టారు. ఆ తర్వాత జరిగింది అసలు కథ. ఇద్దరు మహిళలు అక్కడి నుంచి జారుకున్న తర్వాత యజమానికి అసలు ట్విస్ట్ ఎదురైంది. నకిలీ బంగారం చూసి మనోడు అవాక్కయ్యాడు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 28 Apr 2023, 12:38 pm

ప్రధానాంశాలు:

  • కొండపల్లిలోని బంగారం షాపులో ఘటన
  • సీసీ ఫుటేజ్‌లో రికార్డైన దొంగతనం సీన్
  • పోలీసులకు ఫిర్యాదు.. దర్యాప్తు చేస్తున్నారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
విజయవాడలో లేడీ కిలాడీల చోరీ వ్యవహారం కలకలంరేపింది. అసలు బంగారం స్థానంలో నకిలీ బంగారం పెట్టి సీసీ ఫుటేజ్‌తో అడ్డంగా దొరికిపోయారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో సినీ ఫక్కీలో ఈ దొంగతనం జరిగింది. ఇద్దరు మహిళలు ఓ బంగారం షాపుకు వెళ్లారు. తమకు ఫంక్షన్ ఉందని.. అర్జంట్‌గా వెళ్లాలని.. తమకు ఆభరణాలు కావాలని షాపు యజమాని దగ్గర హడావిడి చేశారు. యజమాని కూడా మహిళల్ని నమ్మి బంగారం తెచ్చి చూపించారు.
ఈలోపు ఇద్దరు మహిళలు అసలు బంగారం స్థానంలో తమ వెంట తెచ్చిన నకిలీ బంగారు నగలు ఉంచారు. ఆ తర్వాత షాపు యజమానిని బురిడీ కొట్టించి అక్కడి నుంచి బంగారు నగలంతో పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత బంగారు షాపు యజమాని నకిలీ బంగారం చూసి అవాక్కయ్యాడు. వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు సీసీ ఫుటేజ్ పరిశీలించారు. అప్పుడు ఇద్దరు కిలాడీ లేడీల చోరీ వ్యవహారం బయటపడింది.

ఇద్దరు మహిళలు అసలు బంగారం స్థానంలో నకిలీ బంగారం మారుస్తున్న సీన్ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. షాపు యజమాని కూడా ఇద్దరు మహిళలు హడావిడి పెట్టడంతో బంగారం మార్చే విషయాన్ని గమనించలేదని చెబుతున్నాడు. ఆ ఇద్దరి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.