యాప్నగరం

విజయవాడ చరిత్రలో తొలిసారి.. ఓ మహిళ నగర బహిష్కరణ!

బెజవాడ చరిత్రలో తొలిసారి ఓ మహిళను నగర బహిష్కరణ చేశారు. పోలీసులు కళ్లుగప్పి.. గంజాయి అమ్ముతున్న సారమ్మ అలియాస్ శారద అనే మహిళను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 24 Apr 2023, 12:07 am
విజయవాడ చరిత్రలో తొలిసారి ఓ మహిళను పోలీసులు నగర బహిష్కరణ చేశారు. ఓ మహిళకు నగర బహిష్కరణ శిక్ష విధించడం హాట్ టాపిక్‌గా మారింది. సారమ్మ అలియాస్‌ శారద అనే మహిళ.. పోలీసుల కళ్లుగప్పి దందాలు చేయడంలో దిట్ట. ఇప్పటికే సారమ్మపై అజిత్‌సింగ్‌ నగర్‌ పీఎస్‌లో 13 కేసులున్నాయి. గంజాయి అమ్మకాలు సహా చాలా వివాదాల్లో ఈమె ప్రమేయం ఉంది. ఈ క్రమంలో శారమ్మపై పోలీసులు నిఘా పెట్టారు. ఆమెపై ఎన్ని కేసులు పెట్టినా ఏ మాత్రం మార్పు రాలేదు.
Samayam Telugu విజయవాడలొ మహిళ నగర బహిష్కరణ



అయితే ఎన్నిసార్లు హెచ్చరించినా, కేసులు పెట్టినా శారద తీరు మారకపోవడంతో పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆమెపై కఠిన శిక్షకు సిద్ధమయ్యారు. సారమ్మ అలియాస్‌ శారదకు చివరికి నగర బహిష్కరణే మార్గమని పోలీసులు భావించారు. ఆమెతో పాటు మరో 19 మందిని విజయవాడ నుంచి బహిష్కరించారు.

కాగా, ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న గంజాయి కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపేందుకు విజయవాడ పోలీసులు నగర బహిష్కరణ అస్త్రాన్ని బయటకు తీశారు. మరోసారి వీళ్లు గంజాయి కేసుల్లో దొరికితే కఠిన చర్యలు ఉంటాయని సీపీ క్రాంతి రాణా టాటా వార్నింగ్‌ ఇచ్చారు. నగర బహిష్కరణకు గురైన వారిలో సారమ్మ అనే మహిళ ఉండడం.. తొలిసారిగా ఓ మహిళపై సీరియస్‌ యాక్షన్‌ ఉండటం హాట్ టాపిక్‌గా మారింది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.