యాప్నగరం

కిషన్ రెడ్డికి బెజవాడలో షాక్.! కేంద్రమంత్రిని అడ్డుకుని.. 2 కార్లకే పర్మిషన్?

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని బెజవాడ పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ర్యాలీగా రావడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. కేంద్ర మంత్రికి సంబంధించిన రెండు కార్లను మాత్రమే అనుమతించడం చర్చనీయాంశంగా మారింది.

Samayam Telugu 19 Aug 2021, 10:15 pm
తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి గంగారపు కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్రలో భాగంగా ఏపీకి వచ్చిన ఆయనకు విజయవాడలో ఊహించని అనుభవం ఎదురైంది. గన్నవరం విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరిన కిషన్ రెడ్డిని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి వస్తుండగా ఎనికేపాడు వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతులు లేవంటూ కేంద్ర మంత్రి ర్యాలీని నిలిపివేశారు. ర్యాలీకి అనుమతి లేదని తేల్చిచెప్పడంతో బీజేపీ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కేవలం రెండు కార్లను మాత్రమే అనుమతించినట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన కార్లు, బైకులు అక్కడే నిలిచిపోయాయి. ఈ ఘటనతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
Samayam Telugu ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
kishan reddy


ఇదిలా ఉంటే.. ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనను వైఎస్ జగన్ దంపతులు సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. అనంతరం ఆయన దుర్గమ్మను దర్శించుకున్నారు. అయితే కేంద్ర మంత్రి వెంట వస్తున్న ర్యాలీని అడ్డుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అనుమతులు లేవని పోలీసులు ఖరాకండిగా చెప్పడంతో చట్టం తన పని తాను చేసుకుపోయిందన్న వాదనలూ వినబడతున్నాయి. కేంద్ర మంత్రిని ఆపడంపై బీజేపీ శ్రేణలు కాస్త నొచ్చుకున్నట్లు తెలుస్తోంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.