యాప్నగరం

ఏపీ ప్రజలకు శుభవార్త.. షిర్డీకి విమాన సర్వీసులు ప్రారంభం, ఆ రెండు ఎయిర్‌పోర్టుల నుంచి!

Vijayawada To Shirdi Indigo Flight ప్రారంభమైంది. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతిలో ప్రారంభం.. విజయవాడ వచ్చి అక్కడి నుంచి షిర్డీకి వెళుతుంది. అటు షిర్డీ నుంచి మరో విమానం విజయవాడ వచ్చి.. అక్కడి నుంచి తిరుపతి వెళుతుంది. డిమాండ్‌ను బట్టి టికెట్ ధర మారిపోతుంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఇండిగో సంస్థ కోరింది. ఇకపై తిరుపతి, విజయవాడ నుంచి షిర్డీకి నేరుగా విమానంలో వెళ్లిపోవచ్చు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 27 Mar 2023, 7:03 am

ప్రధానాంశాలు:

  • తిరుపతి, విజయవాడ నుంచి షిర్డీకి విమానం
  • కొత్త సర్వీసులు ప్రారంభించిన ఇండిగో
  • ప్రతి రోజూ ఈ విమానం అందుబాటులో
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vijayawada Shirdi Flight Service Start
విజయవాడ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. గన్నవరం ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి రోజువారీ ప్రత్యేక విమాన సర్వీసును ఇండిగో సంస్థ ప్రారంభించింది. ఏటీఆర్‌72-600 విమానంలో 72 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి నుంచి విజయవాడకు ఫ్లైట్ వచ్చింది.. 12:25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి షిర్డీ వెళ్లింది.
ఇటు షిర్డీ మధ్యాహ్నం 02:20 గంటలకు బయలుదేరి 4:26 గంటలకు విజయవాడకు మరో సర్వీస్ వస్తుంది. ప్రతి రోజూ ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. టికెట్‌ ప్రారంభ ధర రూ.4,639 కాగా.. డిమాండ్‌‌ను బట్టి టికెట్‌ ధర పెరుగుతుంది. మొదటి రోజు 70మంది షిర్డీ వెళ్లగా.. షిర్డీ నుంచి విజయవాడకు 65మంది వచ్చారు. తిరుపతి నుంచి విజయవాడ మీదుగా షిర్డీ సర్వీసు రాకపోకలు ఉంటాయి. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఇండిగో కోరింది. అలాగే షిర్డీకి సర్వీసు ప్రారంభించడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.