యాప్నగరం

కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లిదండ్రుల ఆత్మహత్య.. కూతురు అనాథగా, కన్నీటి కథ

కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన కుమారుడు.. కొడుకు మరణాన్ని తట్టుకోలేక కొద్దిరోజులుగా మనస్తాపంతో ఉన్నారు. ఆదివారం ఇద్దరూ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 29 May 2022, 7:03 pm

ప్రధానాంశాలు:

  • కొద్దిరోజులుగా భార్యాభర్తల మనస్తాపం
  • కొడుకు లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేక
  • అనాథగా మారిన దంపతుల కుమార్తె
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఎన్టీఆర్ జిల్లా
ఎన్టీఆర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. జి.కొండూరు మండలం చిన నందిగామలో దంపతులు ఆత్మహత్య కలకలంరేపింది. ఆరేపల్లి సాంబశివరావు, విజయలక్ష్మి భార్యాభర్తలు.. అయితే రెండు నెలల క్రితం వీరి కుమారుడు జగదీశ్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనస్థాపం చెందారు. ఆదివారం ఒకే చీరకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఈ దంపతులకు ఓ కుమార్తె ఉండగా ఆమె అనాథగా మారింది. దంపతుల బలవన్మరణంపై జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను మైలవరం ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.. సాంబశివరావు, విజయలక్ష్మిల కుమార్తె పరిస్థితి ఏంటని.. ఆమెను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.