యాప్నగరం

విశాఖవాసులకు శుభవార్త చెప్పిన మంత్రి అమర్‌నాథ్

విశాఖలో ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్. త్వరలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 15 May 2022, 5:50 pm

ప్రధానాంశాలు:

  • విశాఖకు త్వరలోనే అంతర్జాతీయ విమాన సర్వీసులు
  • దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు పై మంత్రి కామెంట్స్
  • రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్న గుడివాడ అమర్‌నాథ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu మంత్రి అమర్
విశాఖవాసులకు ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ శుభవార్త చెప్పారు. కొవిడ్ కారణంగా ఆగిన అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో జరిగిన ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్నారు. మలేషియా, బ్యాంకాక్‌, సింగపూర్‌లకు విమాన సర్వీసులు పునరుద్ధరిస్తామన్నారు.జులై నుంచి విశాఖ-కోలంబో మధ్య విమాన సర్వీసులు ప్రారంభమం అవుతాయన్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నాలుగు విమానాల నుంచి 64 విమానాల స్థాయికి ఎదిగిందని.. 18 లక్షలు మంది ప్రయాణికులు పోకలు సాగిస్తున్నారన్నారు. విశాఖకు మరిన్ని విమాన సర్వీసులు పెంచేలా సహకారం అందిస్తామన్నారు.
మరోవైపు ఈ నెల 22 నుంచి 26 వరకు దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరగబోతోందన్నారు మంత్రి. రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం దావోస్ సదస్సు ద్వారా లభిస్తోందన్నారు. మొత్తం 18 అంశాలపై దావొస్‌లో సదస్సు జరుగుతోందని.. వీటిలో 10 అంశాలు ప్రాధాన్యతగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోందన్నారు. వ్యవసాయం, పర్యాటకం, విద్య, వైద్యం, ఆర్థిక అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టామన్నారు.

దావోస్ సదస్సు ద్వారా ఏపీకి పెట్టుబడులు వస్తాయన్నారు అమర్. వైఎస్సార్ హయాంలో విశాఖలో ఐటికి బీజం పడిందని.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ పాలనలో మరింత ప్రగతి సాధిస్తోందని, బీచ్ ఐటి నినాదం విశాఖకు కలిసి వస్తుందన్నారు. బీచ్ ఐటీ అనే నినాదంతో ఐటి రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.