యాప్నగరం

MLC elections: చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన టీడీపీ సీనియర్ నేత.. తలనొప్పి తప్పదా?

MLC elections: ఉత్తరాంధ్ర పట్టభద్రులు, స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. గురువారం నుంచే ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పి.వి.ఎన్‌.మాధవ్‌ పదవీకాలం మార్చి 29, శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న శత్రుచర్ల విజయరామరాజు పదవీకాలం మే ఒకటితో ముగియనున్నాయి. అయితే.. ఈ రెండు స్థానాల్లో విజయం సాధించాలని టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ సమయంలో.. చంద్రబాబుకు షాక్ ఇచ్చారు టీడీపీ సీనియర్ నేత ఈర్లె శ్రీరామమూర్తి.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 12 Feb 2023, 8:46 pm

ప్రధానాంశాలు:

  • ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వేడి
  • టీడీపీ రెబల్‌‌గా బరిలోకి దిగనున్న ఈర్లె శ్రీరామమూర్తి
  • చంద్రబాబుకు తలనొప్పి తప్పదంటున్న నేతలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Telugu Desam Party
తెలుగుదేశం పార్టీ
MLC elections: పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ సమయంలో.. తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు ఆ పార్టీ సీనియర్ నేత.. ఈర్లె శ్రీరామమూర్తి. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తున్నా.. తనను చూసి ఓర్వలేక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏ పదవీ రానీయడం లేదని ఈర్లె శ్రీరామమూర్తి (Earle Sriramamurthy) ఆరోపించారు. అందుకే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి టీడీపీ రెబల్‌‌గా బరిలోకి దిగుతున్నట్టు స్పష్టం చేశారు.
తనకు వచ్చిన రాజకీయ అవకాశాలను అయ్యన్నపాత్రుడు అడ్డుకుంటున్నాడని.. అలాంటి వ్యక్తిపై పార్టీ ఏ చర్యలూ చేపట్టడం లేదని శ్రీరామమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, ఆర్‌టీఐ కమిషనర్‌గా పదవులిచ్చే సమయంలోనూ అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) అడ్డు తగిలారని ఆరోపించారు. చివరకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయమై తనను చంద్రబాబు పిలిచి.. నీ అభ్యర్థిత్వాన్ని పరిశీలించామని, అచ్చెన్నాయుడిని కలవమని చెప్పినట్టు గుర్తుచేశారు.

చివరి ప్రయత్నంలో బీసీ కులానికి చెందిన మహిళకు కేటాయించారని.. అప్పుడు కూడా తాను బాధపడలేదని శ్రీరామమూర్తి చెప్పారు. కానీ తాజాగా.. ఆమెను తప్పించి తన నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయుడికి కేటాయించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే.. తానే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడేందుకు నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న చిన్ని కుమారి లక్ష్మిని మార్చేసి.. చిరంజీవి రావును Telugu Desam Party రంగంలోకి దించింది. ఆమె ప్రచారం ముమ్మరం చేస్తున్న సమయంలో.. చంద్రబాబు ఊహించని ట్విస్ట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
Read Latest Andhra Pradesh News and Telugu News
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.