యాప్నగరం

భారీస్థాయిలో అవినీతి.. నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా: మాజీ మంత్రి సవాల్

ఇళ్ల పట్టాల కేటాయింపులో అవినీతి జరిగిందని తాను నిరూపిస్తానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా మీడియాపై ఆంక్షలు పెట్టడం దారుణమని మండిపడ్డారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 27 Apr 2022, 2:59 pm
పేదల పేరున ఇళ్ల పట్టాలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి దోపిడీకి శ్రీకారం చుట్టారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేపు విశాఖలో ప్రజలకు ఇచ్చేది దొంగపట్టాలేనని అన్నారు. జగనన్న ఇళ్లులు కావని.. జగన్న మురికివాడలు అని అన్నారు. లేఅవుట్‌లో కనీస నిబంధనలు, పద్ధతులు పాటించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Samayam Telugu మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి.


సబ్బవరానికి సెంట్ భూమి లేకుండా చేస్తున్నా.. ఎమ్మెల్యే అదీప్ రాజు ఎందుకు మాట్లాడడం లేదు..? అని సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. పేదలు ఒక సెంట్లో ఇల్లు ఎలా నిర్మించుకుంటారని అన్నారు. టీడీపీ హయాంలో కట్టిన ఇల్లు లబ్ధిదారులకు ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. మొత్తం ఇది కేంద్రం పథకమని.. రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఇవ్వడం లేదన్నారు. ఇళ్ల పట్టాలలో అవినీతి భారీ స్థాయిలో ఆరోపించారు.

'అవినీతి జరిగిందని నేను నిరూపిస్తాను.. నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా మీడియాపై ఆంక్షలు పెట్టడం దారుణం. అక్రమాలను ప్రశ్నిస్తారనే.. మీడియాపై కఠిన ఆంక్షలు విధించారు..' అని మాజీ మంత్రి బండారు అన్నారు. ఇళ్ల పట్టాలు ఎవరి పంపిణీ చేస్తున్నారో లిస్ట్ ఎందుకు బయటకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇళ్ల పట్టాలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నేతలు తమ అనుకూలమైన వారి పేర్లపై రాయించుకుని అవినీతి పాల్పడ్డారని ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.