యాప్నగరం

MLC Election: పవన్ కళ్యాణ్ మాట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజమైంది: గంటా

MLC Election: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై.. మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితాలు.. ప్రభుత్వానికి గుణపాఠం అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటే నిజమైందని స్పష్టం చేశారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 17 Mar 2023, 1:34 pm

ప్రధానాంశాలు:

  • గంటా శ్రీనివాస రావు కీలక కామెంట్స్
  • ఈ ఫలితాలు ప్రభుత్వానికి గుణపాఠం అని వ్యాఖ్య
  • పవన్ కళ్యాణ్ మాటే నిజమైందన్న మాజీ మంత్రి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ganta Srinivasa Rao
గంటా శ్రీనివాస రావు
MLC Election: ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కేంద్రం వద్దకు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వచ్చారు. లెక్కింపు సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ మాట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజమైందన్నారు. చతుర్ముఖ పోటీ కొనసాగినా.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కడ చీలిపోలేదని Ganta Srinivasa Rao వ్యాఖ్యానించారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం అని గంటా శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు రాష్ట్రం అంతా కనిపించిందని.. రాయలసీమలో కూడా సత్తా చాటుతుండటం టీడీపీ హవాకు సంకేతమని విశ్లేషించారు. మూడేళ్ల క్రితం 50 శాతం పైగా ఓటింగ్ సాధించిన వైసీపీ.. ఇప్పుడు 30 శాతానికి పడిపోయిందని చెప్పారు. ఈ ఒరవడి వచ్చే ఎన్నికలకు నాంది అని.. 2024లో టీడీపీదే విజయమని స్పష్టం చేశారు. రాజధాని సహా.. వైసీపీ చెప్పిన మాటలకు ప్రజల విశ్వాసం లభించలేదన్నారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.