యాప్నగరం

రామతీర్థం చేరిన రాములోరి విగ్రహాలు.. బాలాలయంలో జనవరి 28న ప్రతిష్ఠ

Ramatheertham Vandalise Idol ఘటన రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. దీనిని అధికార, ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం చేశాయి.

Samayam Telugu 24 Jan 2021, 7:51 am
విజయనగరం జిల్లా నెల్లిమర్ల సమీపంలోని రామతీర్థం బోడికొండపై రాముడి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఆలయంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా తిరుమలలో కోదండరాముని విగ్రహాలు రూపుదిద్దుకోగా.. శనివారం అవి రామతీర్థానికి చేరుకున్నాయి. టీటీడీకి చెందిన ఎస్వీ శిల్ప కళాశాలలో స్వామివారి విగ్రహాలను తయారు చేశారు. కృష్ణ శిలతో తయారు చేసిన సీతారామ, లక్ష్మణుల విగ్రహాలను ప్రత్యేక వాహనంలో దేవదాయ ఆర్జేసీ భ్రమరాంబతో పాటు మరికొందరు అధికారులు శనివారం రామతీర్థానికి తీసుకువచ్చారు.
Samayam Telugu రామతీర్థం విగ్రహాలు


విగ్రహాలు తీసుకువచ్చిన వాహనానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి స్వామివారి విగ్రహాలను రామతీర్థంలో తిరు వీథి గావించి ఆలయం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం మంగళవాయిద్యాలతో దేవస్థానం ముఖద్వారం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. దేవస్థానంలో ధ్వజస్తంభం వద్ద విగ్రహాలను పీఠంపై నిలిపి శాస్త్రోక్తంగా అర్చకులు పూజలు నిర్వహించారు. తర్వాత భక్తులు, పోలీసుల సహకారంతో విగ్రహాలను, పీఠాన్ని యాగశాల ఎదురుగా ఉన్న గదిలోకి తరలించి భద్రపరిచారు.

ఆర్జేసీ భ్రమరాంబ మాట్లాడుతూ..జనవరి 28న శాస్త్రోక్తంగా బాలాలయంలో విగ్రహాలను ప్రతిష్టిస్తామని తెలిపారు. విగ్రహాలకు జనవరి 25 నుంచి అంకురార్పణ పూజలు నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. జనవరి 26, 27వ తేదీల్లో యాగశాలలో ప్రాయశ్చిత్త హోమాలు జరుగుతాయన్నారు. 28న కల్యాణ మండపం వద్ద బాలాలయం ఏర్పాటు చేసి అందులో విగ్రహాలను ప్రతిష్ఠించి, నిత్యపూజలు నిర్వహిస్తారని చెప్పారు. నీలాచలంపై కోదండ రామాలయం అభివృద్ధి పనులు పూర్తయ్యాక అక్కడ విగ్రహాలను పునః ప్రతిష్టింపజేస్తామన్నారు. అప్పటివరకు బాలాలయంలోనే స్వామివారికి నిత్యపూజలు కొనసాగుతాయని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.