యాప్నగరం

కొంపముంచిన పప్పుల చీటీ.. అమాయక మహిళలకు కేటుగాడి గాలం, రూ.25లక్షలతో పరార్

చీటీల పేరుతో అమాయక మహిళల నుంచి రూ.25లక్షల వరకు వసూలు చేసిన కేటుగాడు ఆ డబ్బుతో పరారైన ఘటన విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగింది.

Samayam Telugu 12 Jan 2021, 11:42 am
పప్పుల చీటీల పేరుతో అమాయక మహిళల నుంచి డబ్బులు వసూలు చేసిన ఓ వ్యక్తి రూ.25లక్షలతో పరారైన ఘటన విశాఖ జిల్లా పాయకరావుపేటలో చోటుచేసుకుంది. పట్టణంలోని మంగవరం రోడ్డులో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి పప్పుల చీటీ పేరుతో స్థానికంగా ఒక్కో కుటుంబం నుంచి నెలకు రూ.300 చొప్పున 12 నెలలు డబ్బులు కట్టించుకున్నాడు. పాయకరావుపేట, తుని తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 700 మందికి పైగా అతడి వద్ద చీటీలు కట్టారు.
Samayam Telugu చీటీ కార్డులు చూపిస్తున్న బాధిత మహిళలు


Also Read: పటాన్‌చెరు: పెళ్లికి నో చెప్పిన ప్రియుడు.. వదలకుండా వేధింపులు, యువతి షాకింగ్ నిర్ణయం

ఇలా ఒక్కొక్కరూ రూ.3,600 చెల్లించగా అందరికీ రూ.4,500 విలువ చేసే బాస్మతి బియ్యం, నూనె, పప్పు దినుసులు ఇస్తామని హామీ ఇచ్చాడు. చీటీలు కట్టిన వారందరికీ గత నెలలోనే సరకులు ఇవ్వాల్సి ఉంది. అయితే కొద్దిమందికి మాత్రమే సర్దుబాటు చేసిన అతడు మిగతా వారికి ఈ నెల 10న సరుకులు ఇస్తానని హామీ ఇచ్చాడు. దీంతో చీటీలు కట్టినవారంతా అతడి ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. చీటీల పేరుతో అతడు సుమారు రూ.25లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు సోమవారం పాయకరావుపేట పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Also Read: కరోనా తల్లిదండ్రులు మృతి.. ఇంటికి పిలిచి నిప్పింటించిన చెల్లి.. ఆస్తి కోసం కిరాతకం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.