యాప్నగరం

పశువుల కొట్లాటతో బెదిరిన తేనెటీగలు.. భర్త మృతి.. హాస్పిటల్‌లో భార్య!

ఇటీవలి కాలంలో తేనెటీగలు దాడి చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. పశువులు కొట్లాటకు దిగడంతో చెట్టు మీదున్న తేనెటీగలు బెదిరి దాడికి దిగాయి. పశువులతోపాటు పొలంలో పని చేసుకుంటున్న దంపతులను విపరీతంగా కుట్టాయి. ఈ ఘటనలో గాయపడిన దంపతులను విశాఖ కేజీహెచ్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ భర్త చనిపోయాడు, భార్య అదే హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.

Authored byరవి కుమార్ | Samayam Telugu 26 Mar 2023, 10:11 am

ప్రధానాంశాలు:

  • అనకాపల్లి జిల్లాలో తేనెటీగల దాడి
  • హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ భర్త మృతి
  • పొలంలో పని చేసుకుంటుండగా ఘటన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu honey bee
తేనెటీగలు
అనకాపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో భర్త ప్రాణాలు కోల్పోగా.. భార్య హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. రావికమతం మండలం గర్నికం గ్రామానికి చెందిన ఆర్లె కాము నాయుడు (61), అతడి భార్య నూకాలమ్మ (57) దంపతులకు గ్రామం సమీపంలో పశువుల పాక ఉంది.
శుక్రవారం సాయంత్రం గొర్రెలను కాస్తూ దంపతులిద్దరూ పొలంలో పనులు చేసుకుంటున్నారు. అదే సమయంలో మేత కోసం వచ్చిన పశువులు ఓ చెట్టు దగ్గర ఒకదానితో మరొకటి తలపడటంతో ఆ ప్రాంతంలో అలజడి రేగింది. దీంతో ఆ చెట్టు మీద ఉన్న తేనెటీగలు బెదిరిపోయాయి. ఒక్కసారి గాల్లోకి లేచి పశువులతోపాటు అక్కడే ఉన్న దంపతులపైనా దాడి చేశాయి.

అప్రమత్తమైన గ్రామస్థులు గోనె సంచులు కప్పుకొని దంపతులను రక్షించే ప్రయత్నం చేశారు. వారిద్దర్నీ విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. కామునాయుడు చికిత్స పొందుతూ శనివారం చనిపోగా.. ఆయన భార్య నూకాలమ్మ అదే హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.