యాప్నగరం

అశోక్ గజపతి రాజుకు ఘోర అవమానం.. శ్రీరాముడి విగ్రహం కోసం భారీగా డబ్బు పంపితే..!

టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజుకు మరోసారి ఘోర అవమానం జరిగింది.

Samayam Telugu 16 Jan 2021, 4:11 pm
తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు ఘోర అవమానం ఎదురైంది. విజయనగరం జిల్లా రామతీర్థంలో ఇటీవల శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆలయంలో కొత్తం విగ్రహం తయారీకి అశోక్ గజపతి పెద్ద మొత్తంలో డబ్బు పంపించగా.. అధికారులు తిరస్కరించారు. దీనిపై అశోక్ గజపతి ఫైరయ్యారు. వాస్తవానికి రామతీర్థం ఆలయ వ్యవస్థాపకులు గజపతి వంశీయుకులే. విగ్రహం ధ్వంసం వరకు కూడా అశోక్ గజపతిరాజే ఆలయ ధర్మకర్తగా ఉన్నారు. కానీ, విగ్రహం ధ్వంసంలో అశోక్ గజపతి వైఫల్యం ఉందంటూ జగన్ సర్కారు ఆయన్ను పదవి నుంచి తొలగించింది.
Samayam Telugu అశోక్ గజపతి రాజు


తాజాగా, శ్రీరాముడి విగ్రహం కోసం ఇచ్చిన విరాళాన్ని కూడా తిరస్కరించారు. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహాల తయారీ కోసం అశోక్ గజపతి రూ. 1,01116 (లక్షా వెయ్యి నూట పదహారు రూపాయిలు) పంపగా అధికారులు షాకిచ్చారు. దీనిపై అశోక్ గజపతి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. చూడబోతే వ్యవస్థాపక కుటుంబాన్ని దేవస్థానానికి దూరం చేసే ఉద్దేశ్యంలో ఈ ప్రభుత్వం ఉన్నట్లుగా అనిపిస్తోందని ఫైరయ్యారు. ఈ మేరకు శనివారం ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

‘‘మొదట నాకు నోటీసు కూడా ఇవ్వకుండా ఎండోమెంట్ యాక్ట్ సెక్షన్ 28కు తూట్లు పొడుస్తూ నన్ను అనువంశిక ధర్మకర్తగా తొలగించారు. ఇప్పుడు వ్యవస్థాపక కుటుంబ సభ్యునిగా శ్రీరాముని కొత్త విగ్రహాల తయారీ నిమిత్తం నేను భక్తిపూర్వకంగా ఇచ్చిన కానుకను తిరస్కరించారు. చూడబోతే వ్యవస్థాపక కుటుంబాన్ని దేవస్థానానికి దూరం చేసే ఉద్దేశ్యంలో ఈ ప్రభుత్వం ఉన్నట్లుగా అనిపిస్తోంది.’’ అని అశోక్ గజపతి పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుపై అశోక్ గజపతి అభిమానులు, టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.