యాప్నగరం

సీఎం జగన్‌కు స్వామి స్వరూపానందేంద్ర కీలక సూచనలు.. ఏపీలో హిందూ ధార్మిక పరిషత్!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కీలక సూచనలు చేశారు. హిందూ ధార్మిక పరిషత్‌కు సంబంధించి సీఎం జగన్ ముఖ్యమైన సలహా ఇచ్చారు.

Samayam Telugu 17 Feb 2021, 9:14 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి కీలక సలహా ఇచ్చారు. శ్రీ శారదాపీఠం వార్షికోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కాగా, తొలి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం జగన్ హాజరయ్యారు. ‘హిందూ ధార్మిక పరిషత్’ కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారని స్వరూపానందేంద్ర సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో సాధ్యమైనంత త్వరలోనే హిందూ ధార్మిక పరిషత్ ఏర్పాటు నిర్ణయం తీసుకోవడం మంచిదని స్వామీజీ సీఎంకు సలహా ఇచ్చారు.
Samayam Telugu స్వామి స్వరూపానందతో సీఎం జగన్


దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలే వరుసగా జరిగిన దేవాలయాల విధ్వంసంపై కూడా ఇద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఆలయాల సమస్యలపై దేవాదాయ శాఖ తరఫున తొందర్లోనే పీఠాధిపతుల సమావేశాన్ని నిర్వహించి, వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని సీఎం జగన్‌కు స్వామీజీ సూచించారు. ఈ రెండు అంశాలతో పాటు వారసత్వ అర్చకత్వం విషయం కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వారసత్వ అర్చకత్వం విషయంలో చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని, అయితే అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని స్వామి స్వరూపానంద.. సీఎం జగన్‌కు చెప్పారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని స్వామీజీ సూచించారు. స్వామి స్వరూపానందేంద్ర చేసిన సూచనలపై సీఎం జగన్ సానుకూలంగానే స్పందించినట్లు తెలిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.