యాప్నగరం

ఎంపీ రఘురామలా, నన్ను కూడా.. ఆ రెండు రోజులే టార్గెట్: మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందన్న మాజీ మంత్రి. రాష్ట్రంలో కోర్టులు ఉండబట్టే బతుకుతున్నామని.. పోలీసులు రెండు రోజులే తనను టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 1 Jul 2022, 6:28 am

ప్రధానాంశాలు:

  • శని, ఆదివారాల్లో పోలీసులు ఇంటి చుట్టూ
  • ఆ రెండు రోజులు కోర్టులకు సెలవులనే టార్గెట్
  • రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మాట్లాడుతూనే ఉంటా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu అయ్యన్నపాత్రుడు
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishnam Raju)లా తనను సీఐడీ కస్టడీలో కొట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu). అందుకే శని, ఆదివారాల్లో పోలీసులు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఆ రెండు రోజుల్లో కోర్టుకు సెలవులు కాబట్టి.. తనకు రక్షణ దొరకదని అనుకొంటున్నారని వ్యాఖ్యానించారు. అధినేత చంద్రబాబును కలవడానికి వచ్చిన అయ్యన్న కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కోర్టులు ఉన్నాయి కాబట్టి బతుకుతున్నామని.. లేకపోతే తమలాంటి వాళ్లను చంపేసేవాళ్లను తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తానేదో అసభ్య పదజాలంతో మాట్లాడానని కొంతమంది వైఎస్సార్‌సీపీ నేతలతో వాళ్ల ప్లీనరీ సమావేశాల్లో మాట్లాడుతున్నారని.. వాళ్ల భాషలో మాట్లాడితేనే వారికి అర్థం అవుతుందని తాను అలా మాట్లాడాల్సి వస్తోంది అని చెప్పుకొచ్చారు. అలా మాట్లాడకపోతే వాళ్లకు అర్థం కాదని.. తనపై ఏవేవో కేసులు పెడుతున్నారని.. ఆంధ్రా యూనివర్సిటీ పరువు తీశానని ఒక కేసు కొత్తగా పెట్టారని వివరించారు.

తమను భయపెట్టి గొంతు నొక్కాలని చూస్తున్నారని మాజీ మంత్రి ఆరోపించారు. అందుకే ఈ కేసులు పెడుతున్నారని.. ఓ నేత విశాఖలో ఎలా దోచుకొన్నాడో అందరికీ తెలుసని.. తాము రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మాట్లాడుతూనే ఉంటామన్నారు. తన మీద 12 కేసులు పెట్టారని.. తనను అరెస్టు చేయదల్చుకొంటే కేసు నమోదుచేయాలి అన్నారు. ఆ ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వాలి.. దానిని ఆన్‌లైన్‌లో పెట్టాలన్నారు. నిబంధనలు పాటించకుండా ఇంటిపైకి వస్తే తమను కాపాడటానికి కోర్టులు, భగవంతుడు ఉన్నాడు అన్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.