యాప్నగరం

Vizag Au VC ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం.. పోలీసులకు టీడీపీ ఫిర్యాదు

Vizag Au Vc Prasad Reddy పై TNSF నేతలు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే వీసీని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే గవర్నర్‌ను కూడా కలుస్తామంటున్నారు TNSF నేతలు. వీసి విద్వేషపూరిత వ్యాఖ్యలతో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టారని ఆరోపిస్తున్నారు. ఇటీవల రాజధాని అంశంపై ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగుతోంది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 21 Sep 2022, 7:02 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vizag Au Vc Prasad Reddy
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి (AU Vc Prasad Reddy)పై చర్యలు తీసుకోవాలంటూ విశాఖపట్నం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో TNSF రాష్ట్ర అధ్యక్షుడు ఎం వి ప్రణవ్ గోపాల్ ఫిర్యాదు చేశారు. ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తామంటే చూస్తూ ఊరుకుంటామా అనే వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ వీసీగా ఉంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రాంతీయ విద్వేషాలు రగిల్చేలా చేయడం చట్ట వ్యతిరేకం అన్నారు.
గతంలో కూడా రెడ్డి కుల ఆత్మీయ సమావేశంలో వీసీ పాల్గొని వైఎస్సార్‌సీపీకి ఓటు వేయాలని వివాదాన్ని సృష్టించారని గుర్తుచేశారు. ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు విశ్వవిద్యాలయాల చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని.. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వైఎస్సార్‌సీపీ కార్యాలయంగా మార్చారన్నారు. యూనివర్సిటీ ప్రతిష్టకు , ఔన్నత్యానికి ప్రతిబంధకంగా మారారన్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించవలసిన వీసీ విద్వేషపూరిత వ్యాఖ్యలతో ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టడం దురదృష్టకరం అన్నారు.

ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డిని తక్షణమే భర్తరఫ్ చేయాలని TNSF నేతలు డిమాండ్ చేశారు. అడవులను నరికి వేయడం.. రాజకీయ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం.. అవినీతి వంటి చర్యలతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు. ఏయూ వీసీ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని.. ఏయూ వీసీపీపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే గవర్నర్ గారిని కలుస్తామన్నారు.

రాజధాని విషయమై ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాదరెడ్డి విశాఖలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. యూనివర్శిటీ హిందీభవన్‌లో సోమవారం బోయి భీమన్న జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీసీ ప్రసాదరెడ్డి రాజధాని విషయం ప్రస్తావించారు. విశాఖపట్నం రాజధాని కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారని.. ఇప్పుడు ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తామంటే ఊరుకుంటామా అంటూ వ్యాఖ్యానించారట. రాబోయే కాలంలో విశాఖపట్నం రాష్ట్ర పరిపాలన రాజధాని కానుంది అన్నారట. ఈ వ్యాఖ్యలపై TNSF పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.