యాప్నగరం

అరకు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. టూరిస్ట్‌ల కోసం స్పెషల్‌గా..

అరకు.. ఆహా.. ఆ పేరు వినగానే.. పరవశించిన ప్రకృతి ఒడిలో మంచు మేఘాలు మనల్ని అలా తాకుతూ వెళ్తున్న ఓ అనుభూతి.. ప్రకృతి ప్రేమకులకు అరకు లోయ ఓ స్వర్గధామమే. చలికాలంలో అరకు లోయ అందాలు కురివిప్పిన నెమలి సొగసులా కట్టిపడేస్తాయంటే నమ్మండీ..!!

Samayam Telugu 22 Nov 2021, 5:10 pm
అరకు.. ఆహా.. ఆ పేరు వినగానే.. పరవశించిన ప్రకృతి ఒడిలో మంచు మేఘాలు మనల్ని అలా తాకుతూ వెళ్తున్న ఓ అనుభూతి.. ప్రకృతి ప్రేమకులకు అరకు లోయ ఓ స్వర్గధామమే. చలికాలంలో అరకు లోయ అందాలు కురివిప్పిన నెమలి సొగసులా కట్టిపడేస్తాయంటే నమ్మండీ..!! అలాంటి బ్యూటిఫుల్ లొకేషన్‌కు వెళ్లే టూరిస్ట్‌లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగించేందుకు ప్లాన్ చేసింది.
Samayam Telugu అరకు రైలు ప్రయాణం..


అరకులోయకు వెళ్లే టూరిస్టులకు రైల్వే శాఖ సరికొత్త అనుభూతి కలిగించనుంది. అరకు వెళ్లే పర్యాటకుల కోసం విశాఖ నుంచి అరకులోయకు విస్టా డోమ్ కోచ్ లతో ప్రత్యేక రైల్ ను ఏర్పాటు చేసింది. విశాఖ-కిరండూల్‌ ప్రత్యేక రైలును భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ రైల్వేస్టేషన్ లోని ఒకటో నంబర్ ప్లాట్ ఫారంపై ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ స్పెషల్ ట్రైన్ కంపార్ట్‌మెంట్ లో ప్రయాణికులతో ఉపరాష్ట్రపతి, మంత్రి ముచ్చటించారు.

ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు ప్రాంతానికి వెళ్లే టూరిస్టులకు ఈ రైలు ద్వారా సరికొత్త అనుభూతి లభిస్తుందన్నారు. టూరిస్టులను మరింతగా ఆకర్షించేందుకు ఈ రైలు ఎంతో ఉపయోగపడుతుందని.. టూరిజంపరంగా రాష్ట్ర ప్రభుత్వం టూరిస్టులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోందని గుర్తు చేశారు. టూరిస్టులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకుని విహారయాత్రను విజయవంతం చేసుకోవాలని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.