యాప్నగరం

విశాఖలో దారుణం.. రాసలీలలకు అడ్డుగా ఉందని తల్లి ఘాతుకం

ప్రియుడితో రాసలీలలకు అడ్డుగా ఉందని కూతురిని కాటికి పంపిందో కసాయి తల్లి. కిరాతకంగా హతమార్చి గుట్టుచప్పుడు కాకుండా శ్మశానంలో పూడ్చిపెట్టేసింది. కూతురు కనిపించడం లేదని నిలదీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 3 Jun 2021, 9:32 pm

ప్రధానాంశాలు:

  • ప్రియుడితో వెళ్లిపోయిన వివాహిత
  • కూతురు అడ్డుగా ఉందని దారుణ హత్య
  • విశాఖలో వెలుగుచూసిన అమానుషం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu కసాయి తల్లి చేతిలో హత్యకు గురైన చిన్నారి
visakha
విశాఖ నగరంలో అమానుష ఘటన వెలుగుచూసింది. ప్రియుడితో రాసలీలలకు కూతురు అడ్డుగా ఉందని కసాయి తల్లి ఘాతుకానికి పాల్పడింది. మూడేళ్ల చిన్నారిని అత్యంత కిరాతకంగా చంపేసి పూడ్చిపెట్టింది. రెండురోజుల నుంచి కూతురు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు, స్థానికులు నిలదీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. చిన్నారిని చంపేసి అర్ధరాత్రి శ్మశానంలో పాతిపెట్టేసిందని తెలిసి స్థానికులు ఆగ్రహంతో రగిలిపోయారు.
నగరంలోని మారీక వలసకు చెందిన బొద్దాన రమేష్, వరలక్ష్మి భార్యాభర్తలు. ఐదేళ్ల కిందట పెళ్లైన దంపతులకు మూడేళ్ల కూతురు సింధు ఉంది. రమేష్ తాపీమేస్త్రీగా పనిచేస్తుండగా.. వరలక్ష్మి కోస్టల్ ఫుడ్స్ కంపెనీలో పనిచేసేది. ఆ సమయంలో బోర జగదీష్ రెడ్డి అనే వ్యక్తితో వరలక్ష్మికి పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరూ రహస్యంగా రాసలీలలు సాగించేవారు. జగదీష్‌కి అప్పటికే పెళ్లై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

గత మార్చి 14న వరలక్ష్మి ప్రియుడు జగదీష్‌తో వెళ్లిపోయింది. కొద్దిరోజులకి తిరిగొచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 14న మళ్లీ వచ్చిన జగదీష్.. ప్రియురాలిని, ఆమె కూతురు సింధుని తీసుకుని వెళ్లాడు. రెండు రోజుల కిందట భర్త రమేష్‌కి ఫోన్ చేసి కూతురు చనిపోయిందని వరలక్ష్మి చెప్పడంతో అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పాప ఏమైందని ప్రశ్నించడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మూడు రోజుల కిందట పాపను అతి కిరాతకంగా హత్య చేసి.. అర్ధరాత్రి వేళ శ్మశానంలో పూడ్చిపెట్టినట్లు తేలింది. పాప మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. చిన్నారి మెడ, శరీరంపై గాయాలున్నట్లు తెలుస్తోంది. ప్రియుడి మోజులో కన్నకూతురిని కిరాతకంగా చంపేసిందని తెలియడంతో గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆమెపై దాడి చేసేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితులు వరలక్ష్మి, ఆమె ప్రియుడు జగదీష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.