యాప్నగరం

అల్లూరి జిల్లా: పింఛన్ కోసం జనం ఎదురు చూపు.. వాలంటీర్ ట్విస్ట్, మామూలోడు కాదుగా

Chintapalli Volunteer Escapes With Pension Money కలకలంరేపింది. వాలంటీర్ కొందరికి పింఛన్ డబ్బుల పంచి మిగిలిన డబ్బులతో పారిపోయాడు. ఆ తర్వాత వాలంటీర్ కనిపించకపోవడంతో పింఛన్ తీసుకునేవారు కంగారుపడ్డారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎంపీడీవో వివరణ ఇచ్చారు. వాలంటీర్ కుటుంబ సభ్యులు శుక్రవారం డబ్బులు తెచ్చిస్తామని చెప్పినట్లు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.. దీంతో అధికారులు అలర్ట్‌గా ఉంటున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 7 Apr 2023, 7:10 am

ప్రధానాంశాలు:

  • అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘటన
  • పింఛన్ డబ్బులతో వాలంటీర్ పరారీ
  • కొంతమందికి డబ్బులిచ్చి పారిపోయాడు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Chintapalli Volunteer Escaped
అల్లూరి సీతారామరాజు జిల్లాలో పింఛన్ డబ్బులతో వాలంటీర్ పారిపోయారు. చింతపల్లి మండలం చౌడుపల్లి-2 సచివాలయం పరిధిలో..వాంగెడ్డ కొత్తూరు గ్రామానికి చెందిన వాలంటీరు కించె బాలకృష్ణ పింఛన్ల డబ్బుల్ని అక్కడక్కడా లబ్ధిదారులకు పంపిణీ చేశాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బులతో ఉడాయించాడు. తన క్లస్టర్ పరిధిలో 26 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. మొత్తం రూ.66,250ను సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌కు బ్యాంకు నుంచి డ్రా చేసి వాలంటీరుకు అందజేశారు.
వాలంటీర్ బాలకృష్ణ పింఛను సొమ్మును 13 మందికి మాత్రమే పంపిణీ చేశారు.. మిగిలిన వారికి డబ్బులు ఇవ్వకుండా పారిపోయాడు. మిగిలిన డబ్బుల్లో రూ.30,250 తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి ఆ వాలంటీరు కనిపించకపోవడంతో సచివాలయ సంక్షేమ సహాయకుడు ఎంపీడీవోకు సమాచారం అందించారు. ప్రభుత్వం ఈనెల 8వ తేదీ వరకు పింఛన్ల పంపిణీకి గడువు ఇచ్చిందన్నారు ఎంపీడీవో. వాలంటీరు కుటుంబ సభ్యులు పింఛను సొమ్మును శుక్రవారం నాటికల్లా తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. కొందరు వాలంటీర్లు పింఛన్ డబ్బులతోపారిపోతే.. మరికొందరు పింఛన్‌ తీసుకునేవారి అకౌంట్‌లో డబ్బుల్ని నొక్కేశారు. అధికారులు కూడా ఇలాంటి ఘటనలపై సీరియస్‌గా స్పందిస్తున్నారు. తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటున్నారు. అయినా సరే కొందర వాలంటీర్లలో మార్పు రావడం లేదు.

మరోవైపు గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది క్రమబద్ధీకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సచివాలయ సిబ్బందికి 2021 అక్టోబర్ ప్రోబేషన్ పూర్తయింది. 2022 జూన్ నుంచి రెగ్యులరైజేషన్ జరిగింది అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వారికి 2021 అక్టోబరు నుంచి పే స్కేల్‌ను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. అయితే ఆ బకాయిలకు మాత్రం చెల్లించలేదన్నారు. గ్రామ/వార్డు సచివాలయాలలో ఇంకా దాదాపు 40,000 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ పెండింగ్ లో ఉంది అన్నారు.

ఇది ఉద్యోగుల మధ్య అసమానతలను సృష్టిస్తోంది అన్నారు. సచివాలయ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లింకపోవడం.. కొందరికి క్రమబద్ధీకరణ చేయకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారన్నారు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందిని తక్షణమే క్రమబద్ధీకరించాలని కోరారు. క్రమబద్ధీకరించబడిన సిబ్బందికి పెండింగ్ బకాయిలు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలి అన్నారు. AP గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ (APGLI), కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS), ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (EHS) కింద గ్రామ/వార్డు సెక్రటేరియట్ సిబ్బంది నుండి మినహాయించబడిన మొత్తాలను వెంటనే సంబంధిత ఖాతా హెడ్‌లలో జమ చేయాలన్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.