యాప్నగరం

104కి ఫోన్ చేసిన విజయసాయిరెడ్డి.. షాకింగ్ రియాక్షన్, కష్టకాలంలో ఇలానా!

విశాఖపట్నంలోని 104 కంట్రోల్ రూమ్‌ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Samayam Telugu 30 Apr 2021, 4:59 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా విశాఖపట్నంలో కరోనా పంజా విసురుతోంది. ఈ తరుణంలో ప్రభుత్వ సేవలు సరిగా అందడం లేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో విశాఖపట్నం కలెక్టరేట్‌లోని 104 కంట్రోల్‌ రూమ్‌కు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వచ్చారు. అయితే విజయసాయి వచ్చిన సమయంలో ఒక్క ఫోన్ కాల్‌ కూడా రాలేదు.
Samayam Telugu 104 కాల్ సెంటర్‌లో  విజయసాయిరెడ్డి



దీంతో విజయసాయిరెడ్డికి అనుమానం రావడంతో స్వయంగా 104కి ఫోన్‌ చేశారు. అయితే, ఫోన్ కాల్‌ కనెక్ట్‌ కాకపోవడంతో విజయసాయిరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై సంబంధిత అధికారులను నిలదీశారు. అయితే, సర్వర్‌లో సాంకేతిక లోపం ఉందని, అందుకే కాల్ కనెక్ట్ కాలేదని అధికారులు చెప్పారు. దీంతో, వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను విజయసాయిరెడ్డి ఆదేశించారు. అనంతరం కేజీహెచ్‌లో వైరాలజీ లాబ్‌ను సైతం విజయసాయిరెడ్డి సందర్శించారు. టెస్టింగ్, నిర్వహణ తీరును వైద్యుల నుంచి అడిగి ఆయన తెలుసున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.