యాప్నగరం

విజయనగరం: 5 రూపాయల నాణెం మింగిన ఐదేళ్ల బాలుడు.. చాకచక్యంగా తీసిన డాక్టర్!

Viziangaram District లో ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ ఐదు రూపాయల కాయిన్ మింగేశాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు అక్కడ డాక్టర్ జాగ్రత్తగా నాణెంను బయటకు తీశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 8 Aug 2022, 2:35 pm

ప్రధానాంశాలు:

  • విజయనగరం జిల్లాలో ఘటన
  • రూ.5 కాయిన్‌ను మింగేశాడు
  • ఎండోస్కోపీ విధానంలో తీశారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vizianagaram Boy Coin
గతవిజయనగరం జిల్లా తెర్లాం మండలం ఉద్దవోలులో బాలుడు ఐదు రూపాయల కాయిన్ మింగేశాడు. ఐదు ఏళ్ల బాలుడు ఇంటి దగ్గర ఆడుకుంటూ 5 రూపాయల నాణెం మింగేసాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో విలవిల్లాడాడు. తీవ్రంగా ఏడుస్తూ బాలుడు అస్వస్థతకు గురవ్వటంతో.. తల్లిదండ్రులు హుటాహుటిన రాజాం పట్టణంలోని ఆరోగ్య హాస్పిటల్‌కి తరలించారు. డాక్టర్ సుంకర రఘు వెంటనే బాలుడికి ఎక్సరే తీయించి.. అన్నవాహికలో నాణెం ఉన్నట్లు గుర్తించారు.
డాక్టర్ ఎండోస్కోపి విధానం ద్వారా బాలుడు అన్నవాహికలో ఇరుక్కున్న 5 నాణెంను జాగ్రత్తగా బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పిల్లలకు నాణెలను దూరంగా ఉంచడం మంచిది.. లేనిపక్షంలో ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. గతంలో కూడా ఇలాంటి తరహా ఘటనలు చాలానే జరిగాయి.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.