యాప్నగరం

పార్వతీపురం: పోలీసుల జీపు ఎత్తుకెళ్లిన ఘనుడు.. యువకుడు చెప్పిన కారణంతో అందరూ అవాక్కు

Parvathipuram Police Vehicle Theft ఒడిశాలో పోలీసుల జీపును చోరీ చేసిన యువకుడు.. ఎందుకు చోరీ చేశావని అడిగితే ఊహించని సమాధానం.. ఏపీలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 7 Nov 2022, 1:59 pm

ప్రధానాంశాలు:

  • పోలీసులపై కక్షగట్టిన యువకుడు
  • ఒడిశాలో జీపుతో సహా పరారయ్యాడు
  • పార్వతీపురం జిల్లాలో అరెస్ట్ చేశారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Parvathipuram Police Vehicle Theft
కంప్లైంట్ చేస్తే పట్టించుకోలేదని ఒడిశా పోలీసులపై కోపం పెంచుకున్నాడో యువకుడు. ఏదైనా చేసి వారిపై రివెంజ్ తీర్చుకోవాలని అనుకున్నాడు. సమయం కోసం వేచిచూశాడు. చివరకు అతను ఆశించిన టైమ్ రానే వచ్చింది. ఇంకేముంది.. పోలీసులను ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతో పోలీసులకు మస్కా కొట్టి వారి జీపు తీసుకుని ఉడాయించాడు. ఈ ఘటన ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జరిగింది.
తను ఇచ్చిన ఫిర్యాదు పట్టించుకోకుండా.. తనపై దాడిచేశారనే కోపంతో ఆ యువకుడు ఈ పని చేశాడు. ప్లాన్ చేసి ఒడిశా పోలీసులకు చెందిన వాహనంతో పరారయ్యాడు. అయితే పార్వతీపురం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు ఆ యువకుణ్ని అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో సదరు యువకుడు ఈ పనిచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ యువకుడు రాజమహేంద్రవరానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు.

ఏదేమైనా.. పోలీసులకు మస్కా కొట్టి వారి వాహనంతో సహా పరార్ కావటం ఆ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశమైంది. వాహనం తీసుకుని ఉడాయించిన యువకుణ్ని పట్టుకునేందుకు పాపం ఒడిశా పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చివరకు పార్వతీపురంలో ఏపీ పోలీసులు యువకుణ్ని, పోలీసు జీపుతో పాటు అదుపులోకి తీసుకోవటంతో ఒడిశా పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.