యాప్నగరం

రాజాంలో ఇల్లు కూలుస్తుంటే బయటపడిన పురాతన లాకర్.. బంగారం నిధి ఉందంటూ ప్రచారం

Rajam Old House Locker కలకలంరేపింది. ఓ పాత ఇంటిని కూలుస్తుండగా పురాతన లాకర్ బయటపడిందట. ఈ లాకర్ విషయంలో కూలీలు, ఇంటి యజమాని మధ్య వివాదం మొదలైంది. దీంతో ఈ విషయం బయటపడింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 13 Aug 2022, 10:08 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Rajam Locker
విజయనగరం జిల్లా రాజాంలో పురాతన లాకర్ (Rajam Old House Locker) బయటపడింది. పట్టణంలోని కంచర వీధిలో ఇల్లు తొలగిస్తుండగా ఓ లాకర్ బయటపడింది. వెంటనే ఇంటి యజమాని దానిని పక్కన పెట్టారు. అందులో బంగారం ఉందంటూ ప్రచారం జరగడంతో.. కూలీలు, యజమాని మధ్య వివాదం మొదలైంది. లాకర్ పగులగొట్టి అందులో బంగారంలో తమకు సగం ఇవ్వాలని కోరారు. యజమాని మాత్రం లాకర్‌లో ఏమీ లేదని చెబుతున్నారు. కూలీలు మాత్రం రెండు కేజీల బంగారం ఉందని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ లాకర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.