యాప్నగరం

Vizianagaram: ఆర్టీసీ బస్సు చోరీ.. అందరూ కంగారుపడుతున్న సమయంలో ట్విస్ట్!

Vizianagaram Rtc Bus Theft కలకలంరేపింది. నైట్ హాల్ట్ బస్సును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బస్సు కనిపించకపోవడంతో డ్రైవర్, కండక్టర్ అవాక్కయ్యారు.. తీరా బస్సును ఆ దగ్గరలోనే వదిలేసి వెళ్లారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 9 Aug 2022, 10:52 am

ప్రధానాంశాలు:

  • వంగరలో ఆర్టీసీ బస్సు మాయం
  • నైట్ హాల్ట్ బస్సును ఎత్తుకెళ్లారు
  • ఇంతలోనే ఊహించని ట్విస్ట్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Vizianagaram Rtc Bus
విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సు చోరీ ఘటన కలకలంరేపింది. వంగర మండల కేంద్రంలో నైట్ హాల్ట్ ఆర్టీసీ బస్సు మాయం అయ్యింది. రాజాం నుంచి వంగర ఆర్టీసీ బస్సు నైట్ హల్ట్ సర్వీస్ నడుస్తోంది. రాజాం నుంచి వంగర బస్సు వెళ్లింది.. అర్ధరాత్రివేళ బస్సును గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. తీరా బస్సు కనిపించకపోవడంతో డ్రైవర్, కండక్టర్ అవాక్కయ్యారు. వెంటనే రంగంలోకి దిగి ఆరా తీశారు.
ఉదయం మాయమైన బస్సు ఆచూకీ లభ్యం అయ్యింది. రేగిడి ఆమదాలవలస మండలం మీసాల డోలపేట దగ్గర గుర్తించామని ఆర్టీసీ డీఉం వెంకటేశ్వరరావు తెలిపారు. ఆర్టీసీ అధికారులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బస్సును తీసుకెళ్లిన దొంగల కోసం గాలింపు చేపట్టారు. ఆ దగ్గరలోని సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. బస్సును చోరీ చేయాలని తీసుకెళ్లారా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఆరా తీస్తున్నారు. ఈ ఆర్టీసీ బస్సు చోరీ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.