యాప్నగరం

భలే దొంగ.. సెంట్రల్ జైల్ నుంచి బయటపడ్డాడు అనుకుంటే.. మళ్లా ఇట్టే పట్టుబడ్డాడు..

Samayam Telugu 14 Dec 2021, 9:22 pm
ఒక్కొక్కళ్లకి దొంగతనం అస్సలు అచ్చురాదు.. తప్పు చేసిన వెంటనే బుక్కైపోతారు.. అచ్చు ఇలాంటి దొంగే పొద్దున జైలు నుంచి బయటకొచ్చి.. రాత్రి దొంగతనం చేసి మళ్లా వారం లోపు జైలుకెళ్లాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


విశాఖ జిల్లా దేవరాపల్లికి చెందిన వి.పవన్ కుమార్ ఈ నెల 7వ తేదీన వైజాగ్ సెంట్రల్ జైల్ నుంచి విడుదలయ్యి.. నేరుగా సొంతూరికి వెళ్లాడు. అక్కడి వెళ్లగానే పాత స్నేహితులు రాము, మణివర్మ, నానిని పలకరించి.. రాత్రికి తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనం చేద్దామని ఒప్పించాడు.

విజయనగరం జనార్దన్ నగర్‌లో ఉంటున్న సావిత్రికి ఇటీవల ఆరోగ్యం బాగాలేక ఇంటికి తాళం వేసి విశాఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. దీంతో అనుకున్నదే తడవుగా.. పవన్ స్నేహితులతో కలిసి దేవరాపల్లి నుంచి కొత్తవలస వచ్చి తాళం వేసిన సావిత్రి ఇంటిని సెలక్ట్ చేసి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న సొమ్మును మూటకట్టి తిరిగి దేవరాపల్లి వెళ్లారు. ఆ తర్వాత రోజు ఇంటికి వచ్చిన బాధితురాలు సావిత్రి కుమారుడు ఇంట్లో దొంగతనం జరిగిందని.. నలభై ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు, 1.7 కిలోల వెండి, రూ.2 లక్షల నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పవన్, రాము, మణివర్మని అదుపులోకి తీసుకున్నారు. నాని పరారీలో ఉన్నాడని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ దీపక ఎం.పాటిల్ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.