యాప్నగరం

విజయనగరం: ఫోన్ పేను వదలడం లేదు.. వీళ్లు మామూలోళ్లు కాదు, ఇదో వెరైటీ చోరీ

ఈనెల 5న డైట్‌ కాలేజీ దగ్గరలో ఇంటికి వస్తున్నారు. అదే దారిలో ఇద్దరు యువకులు మురళీధర్‌ను ఆపారు.. తాము పోలీసులమని చెప్పారు. అతడ్ని బెదిరించి.. జేబులో ఉన్న పర్సులో డబ్బులు లాక్కున్నారు.

Samayam Telugu 11 Nov 2021, 9:20 am

ప్రధానాంశాలు:

  • విజయనగరం జిల్లాలో ఘటన
  • ఉద్యోగిని బెదిరించిన యువకులు
  • ఫోన్ పేలో డబ్బులు అడిగారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu విజయనగరం జిల్లా
విజయనగరం జిల్లాలో దోపిడీ గ్యాంగ్ ఫోన్ పేను వదల్లేదు. ఓ వ్యక్తిని బెదిరించి ఫోన్‌పే ద్వారా డబ్బులు వసూలు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. గుర్ల మండలంలోని సచివాలయ ఇంజినీరు అసిస్టెంట్ మురళీధర్‌ ఈనెల 5న డైట్‌ కాలేజీ దగ్గరలో ఇంటికి వస్తున్నారు. అదే దారిలో ఇద్దరు యువకులు మురళీధర్‌ను ఆపారు.. తాము పోలీసులమని చెప్పారు. అతడ్ని బెదిరించి.. జేబులో ఉన్న పర్సులో డబ్బులు లాక్కున్నారు. చేతికి ఉన్న ఉంగరాన్ని తీసుకుంటుండగా.. అది తనకు సెంటిమెంట్ అని చెప్పానే.
ఆ ఉంగరం తిరిగి ఇవ్వాలంటే తమకు ఫోన్‌పే ద్వారా కానీ, గూగుల్‌పేలో కానీ రూ.5 వేలు పంపిస్తే ఉంగరం వదిలేస్తామన్నారు. మురళీధర్ భయపడి అలాగే చేశారు. ఫోన్ పేలో డబ్బులు పంపారు. తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయవారు. ఆ వెంటనే బాధితుడు నెల్లిమర్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫోన్ పే ద్వారా డబ్బులు పంపడంతో ఆ మొబైల్ నంబర్ ఆధారంగా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దర్ని నెల్లిమర్ల మండలానికి చెందిన యువకులుగా గుర్తించారు. చెడు వ్యసనాలకు బానిసైన ఆ ఇద్దరూ దారి కాసి ఇలా బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.