యాప్నగరం

భూమికి ముంచుకొస్తున్న ముప్పు!!

ఏ క్షణంలోనైనా గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని తెలిపారు.

Samayam Telugu 21 Jun 2017, 5:02 pm
భూమిని ఉల్క ఢీకొట్టడం ఖాయమని అందు కోసం ప్రపంచం సిద్ధంగా ఉండాలని ఐర్లాండ్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త అలాన్ ఫిట్జ్ సిమ్మన్స్ హెచ్చరించారు. అంతే కాదు ఢీకోట్టడానికి ముందే అది ముక్కలుగా విడిపోవచ్చని క్వీన్స్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్న సిమ్మన్స్ పేర్కొన్నారు. సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతాన్ని 1908 జూన్ 30న ఒక చిన్న ఉల్క ఢీకొట్టడంతో 800 చదరపు మైళ్ల భూభాగం సర్వనాశనమైందని తెలిపారు. గ్రహశకలం విధ్వంసం కారణంగానే ఆ రోజును ప్రపంచ ఆస్ట్రాయిడ్ డేగా నిర్ణయించారని ఫిట్జ్‌సిమ్మన్స్ తెలియజేశారు. ప్రస్తుత తరుణంలో ఆ స్థాయి గ్రహశకలం ఢీకొంటే ఒక పెద్ద నగరం భస్ం అవుతుందని అన్నారు.
Samayam Telugu asteroid hitting earth very much possible warns scientist
భూమికి ముంచుకొస్తున్న ముప్పు!!


పెద్ద ఉల్క ఢీకొంటే జరిగే నష్టం అపారమని, ఎంతో ప్రమాదకరంగా ఉంటుందని చెప్పారు. మన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఎంతో కృషి చేసి భూమికి సమీపంలో మనకు హాని కలిగించే 1800 ఉల్కలనును గుర్తించారని, అయితే ఇంకా చాలా వాటిని గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రోజూ మన శాస్త్రవేత్తలు భూమికి దగ్గరగా ఉండే ఉల్కలను గుర్తిస్తూనే ఉంటారని, అయితే వాటి వల్ల హాని జరగదని తెలిపారు. మరో తుంగుస్కా ఘటన ఏ క్షణంలోనైనా జరిగే అవకాశం ఉందని, కాబట్టి అందరూ దీనికి సిద్ధంగా ఉండాలని హెచ్చిరించారు. జూన్ 30 న ప్రపంచ ఆస్ట్రాయిడ్ డే సందర్భంగా లక్సెంబర్గ్‌ వేదికగా ఖగోళ శాస్త్రవేత్తలు, నిపుణులతో జరిగే చర్చలో సిమ్మన్స్ పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా చేయనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.