యాప్నగరం

ఈ పరిహారాలు పాటిస్తే రోగాలు మటుమాయం.. అనారోగ్యం ఊసే ఉండదు

కొన్నిసార్లు ఎంత చికిత్స తీసుకున్నా మీకు రోగాల నుంచి ఉపశమనం లభించదు. కొన్నిసార్లు గ్రహాల స్థితి కూడా ఇందుకు కారణం కావచ్చు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపశమనం లభించకపోతే చింతించకండి. లాల్ కితాబ్ ప్రకారం కొన్ని పరిహారాలు పాటిస్తే మీ ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది.

Samayam Telugu 6 Sep 2021, 8:07 pm
ప్రస్తుత కాలంలో రోగాలు, అంటువ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. వాతావరణ మార్పులు వల్ల వచ్చే వ్యాధులు త్వరగానే నయమవుతుంటాయి. అయితే కొన్నిసార్లు ఎంత చికిత్స తీసుకున్నా మీకు రోగాల నుంచి ఉపశమనం లభించదు. కొన్నిసార్లు గ్రహాల స్థితి కూడా ఇందుకు కారణం కావచ్చు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపశమనం లభించకపోతే చింతించకండి. లాల్ కితాబ్ ప్రకారం కొన్ని పరిహారాలు పాటిస్తే మీ ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యం సమస్యలను సులభంగా పరిష్కరించుకుంటారు. ఈ నేపథ్యంలో లాల్ కితాబ్ ప్రకారం ఆరోగ్యం మెరుగుపడాలంటే పాటించాల్సిన కొన్ని పరిహారాల గురించి ఇప్పుడు చూద్దాం.
Samayam Telugu according to lal kitab these are the remedies for health issues in telugu
ఈ పరిహారాలు పాటిస్తే రోగాలు మటుమాయం.. అనారోగ్యం ఊసే ఉండదు



​పొద్దుతిరుగుడు పువ్వు అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది..

లాల్ కితాబ్ ప్రకారం పొద్దుతిరుగుడు పువ్వుతో పరిహారం మంచి ప్రయోజనాలను ఇస్తుంది. ముందుగా పొద్దు తిరుగుడు పువ్వు రసం తీసుకోండి. దీని తర్వాతా దానికి ఎర్రచందనం కలపండి. అనంతరం దాన్ని ఎర్రని వస్త్రంలో కట్టి మీ పర్సులో ఉంచుకోండి. ఇలా చేయడం ద్వారా అన్ని పనులు సులభంగా పూర్తవుతాయని విశ్వసిస్తారు. అంతేకాకుండా చెడు కర్మల గురించి ప్రయోజనాలు ఏర్పడతాయి.

​ఈ పరిహారంతో వ్యాధులు నయమవుతాయి..

లాల్ కితాబ్ ప్రకారం తీవ్రమైన రోగాలు ఇబ్బంది పెడుతుంటే ఈ పరిహారం పాటించాలి. వెండిని ధరించడం ద్వారా ఈ పరిస్థితుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అనంతరం కుంకుమను నీటిలో వేసి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి నుదుటిపై రుద్దండి. ఇలా చేయడం వల్ల తీవ్రమైన రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రోగాలన్నీ మటుమాయమవుతాయి.

​ఈ పరిహారం వ్యాధులను తొలగిస్తుంది..

లాల్ కితాబ్ ప్రకారం ఏదైనా ఆందోళనలతో మీరు ఇబ్బంది పడుతుంటే దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. శివుని ముందు క్రమం తప్పకుండా ఓం బామ్ బం నమో రుద్రేభ్యోసం సం సాక్షి స్వాహా అనే మంత్రాన్ని జపించండి. ఇదే సమయంలో ఎవరైనా నయం చేయలేని వ్యాధితో బాధపడుతుంటే దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతో పాటు ఓం హ్రీం ఫట్ స్వాహా అనే మంత్రంతో 7 సార్లు జపించాలి. ఇలా చేయడం ద్వారా వ్యాధులు తొలిగిపోతాయని నమ్ముతారు.

​ఇంటి సమస్యలతో బాధపడుతుంటే..

లాల్ కితాబ్ ప్రకారం ఇంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఇందుకోసం 12 అంగుళాల పొడవైన పలాష్ ను కలపను తీసుకోండి. అనంతరం దాన్ని ఇంటి బయట, లోపల పాతిపెట్టండి. దీంతో గ్రహాలన్నీ అడ్డంకులు తొలుగుతాయని విశ్వసిస్తారు. అలాగే ఇంట్లో సంపద ఉంటుంది.

గమనిక: ఇక్కడ పేర్కొన్న పరిహారాలు శాస్త్రాల తీసుకున్న వాస్తవాల ప్రకారం మాత్రమే. వాటిని ఉపయోగించే ముందు దయచేసి నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోండి. సంప్రదించకుండా ఉపయోగించడం మర్చిపోవద్దు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.