యాప్నగరం

Mahashivratri 2023 మహా శివరాత్రి వేళ శివ లింగానికి ఈ ప్రత్యేక వస్తువులను సమర్పిస్తే.. విశేష ప్రయోజనాలు పొందొచ్చు...

Mahashivratri 2023 మరికొన్ని గంటల్లో మహా శివరాత్రి పండుగ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని శివాలయాలన్నింటినీ అందంగా ముస్తాబయ్యాయి. ఈ సందర్భంగా శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 17 Feb 2023, 1:36 pm
Mahashivratri 2023 హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని క్రిష్ణ పక్షంలోని చతుర్దశి తిథి నాడు మహా శివరాత్రి పండుగ వచ్చింది. ఈసారి 18 ఫిబ్రవరి 2023 శనివారం నాడు వచ్చింది. ఇదే రోజున శని ప్రదోష వ్రతం కూడా రావడం విశేషం. ఈ పవిత్రమైన రోజున శివయ్యను, శని భగవానుడికి పూజించడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు.. తమ కోరికలను నెరవేర్చుకునేందుకు కొన్ని ప్రత్యేక పరిహారాలను పాటించాలి. వాటి వల్ల ఈశ్వరుని అనుగ్రమం తప్పకుండా లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.
Samayam Telugu mahashivratri 2023 what should be offered to lord shiva and do these remedies on mahashivratri in telugu
Mahashivratri 2023 మహా శివరాత్రి వేళ శివ లింగానికి ఈ ప్రత్యేక వస్తువులను సమర్పిస్తే.. విశేష ప్రయోజనాలు పొందొచ్చు...


పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ..

మహా శివరాత్రి రోజున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో రుద్రాష్టాధ్యాయిని పఠించాలి. దీంతో పాటు పరమేశ్వరుడికి పాలు, గంగాజలం, తేనే, పెరుగు లేదా నెయ్యితో అభిషేకం చేయాలి. మీరు రుద్రాష్టాధ్యాయిని పఠించలేకపోతే ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శివునికి అభిషేకం చేయాలి.

Mahashivratri 2023 శివయ్య వేషధారణ రహస్యాలేంటి... శంకరుని శరీరంపై పులి చర్మం ఉండేందుకు గల కారణాలేంటో తెలుసా...

ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి..

ఎవరైతే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటారో.. వారంతా మహా శివరాత్రి రోజున ఆరు ముఖాల రుద్రాక్షలను ధరించాలి. అలాగే ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా పూజించాలి. శివ లింగం ఉండే ఇంట్లో ఎలాంటి ప్రతికూల శక్తుల ప్రభావం అనేదే ఉండదు. వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. వీటితో పాటు మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వల్ల దుఃఖం, వ్యాధులు, ఇతర సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

పాలతో అభిషేకం..

మహా శివరాత్రి రోజున పరమేశ్వరునికి పాలతో అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. ఈరోజున శివలింగానికి చేసే రుద్రాభిషేకం వల్ల విశేష ప్రాధాన్యత లభించనుంది. పాలతో కలిపి శివలింగానికి రుద్రాభిషేకం చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతారు. వీటితో పాటు పాలను దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు.

జలాభిషేకం..

మహా శివరాత్రి రోజున శివలింగానికి జలాభిషేకం చేయాలి. ఈ సమయంలో ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం, శివుని కంఠంలో విషం ప్రభావం తగ్గించేందుకు, దేవతలందరూ శివయ్యకు జలాభిషేకం చేశారు. అప్పటినుంచి నీలకంఠుడు అనే పేరు వచ్చింది.

బిల్వపత్రాలు..

బిల్వ పత్రాలను మహాదేవుని మూడు నేత్రాలకు ప్రతీకగా భావిస్తారు. అందుకే మూడు ఆకులతో ఉండే బిల్వ పత్రం అంటే ఈశ్వరునికి ఎంతో ప్రీతికరమైనది. శివుని ఆరాధనలో బిల్వపత్రానికి తొలి స్థానం దక్కుతుంది. భోలేనాథుడికి బిల్వపత్రం సమర్పిస్తే కోటి మంది ఆడపిల్లలను దానం చేసినటువంటి ఫలితం దక్కుతుందని పండితులు చెబుతారు.

కష్టాలు తొలగిపోవడానికి..

మహా శివరాత్రి రోజున శివలింగానికి పెరుగు, నెయ్యి, గంధం, తేనే సమర్పించాలి. శివయ్యకు పెరుగును నైవేద్యంగా సమర్పించడం వల్ల వ్యక్తిలో పరిపక్వత లభించి, తన జీవితంలో స్థిరత్వం వస్తుందని నమ్ముతారు. అంతేకాదు భోళాశంకరుడికి పెరుగును సమర్పించడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.

సంతానం కావాల్సిన వారు..

అదే విధంగా నెయ్యిని శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే శివలింగానికి నెయ్యితో అభిషేకం చేస్తే, శివ భక్తుల బలం పెరుగుతుందని నమ్ముతారు. అలాగే సంతానం కావాల్సిన వారు కూడా శివునికి నెయ్యి సమర్పించాలి. పురాణాల ప్రకారం, శివలింగానికి గంధం రాయడం ద్వారా ఆకర్షణీయమైన రూపాలను పొందుతారు. తన జీవితంలో గౌరవం, కీర్తికి లోటు అనేదే ఉండదు. శివ లింగానికి తేనే పూయడం వల్ల తమ మాటతీరులో మాధుర్యం పెరుగుతుందని, ఎవరి పట్ల ద్వేషభావం ఉండదని నమ్ముతారు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Read Latest Astrology News and Telugu News

రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.