యాప్నగరం

ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదా.. అయితే ఈ పరిహారాలు పాటించండి

ఉద్యోగం కోసం లేదా ఉద్యోగంలో సమస్యలు పరిష్కారానికి కొన్ని పరిహారాలు పాటించాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని కార్యకలాపాలను పాటించండి. అవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి ఉద్యోగం పొందాలంటే ఎలాంటి నివారణలు, కార్యకలాపాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Samayam Telugu 9 Feb 2021, 8:55 am
"ఉద్యోగం పురుష లక్షణం" అని అంటారు. ఉపాధి లేకపోతే ఇతరులకే కాకుండా కుటుంబ సభ్యులకు కూడా చులకన అవుతారు. అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉద్యోగం రాదు. కొంతమందికైతే స్థిరత్వం ఉండదు. కొన్నిసార్లు సహచరులు, ఉన్నతాధికారులతో వివాదాలు ఉంటాయి. ముఖ్యంగా పదోన్నతుల విషయంలో కలతలు వస్తాయి. మీరు ఈ సమస్యల నుంచి ఉపశమం పొందాలంటే కొన్నిచర్యలు పాటించాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని కార్యకలాపాలను పాటించండి. అవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి ఉద్యోగం పొందాలంటే ఎలాంటి నివారణలు, కార్యకలాపాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Samayam Telugu these are the astrological remedies for good job
ఎన్నిసార్లు ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదా.. అయితే ఈ పరిహారాలు పాటించండి



​శ్రీమహావిష్ణువును ఆరాధించండి..

మీరు తరచూ ఉద్యోగం మారాల్సి వస్తున్నా, అందులో స్థిరత్వం లేకపోయినా జ్యోతిషశాస్త్రం ప్రకారం శ్రీహరిని పూజించాలి. శుక్లపక్షంలోని ప్రతి గురువారం విష్ణువును ఆరాధించండి. శ్రీహరికి కుంకుమ తిలకాన్ని ధరించండి. దీని తర్వాత మీ నుదిటిపై అదే తిలకాన్ని రుద్దండి. అప్పడు విష్ణువుకు మూడు అరటిపండ్లు సమర్పించండి. అరటి మొక్కను నీళ్లు అర్పించి వాటిని శ్రీమహావిష్ణువుకు దానం చేయండి. ఈ పరిహారాన్ని క్రమం తప్పకుండా 43 రోజుల పాటు చేయండి. ఇలా చేయడం ద్వారా ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది.

​ఈ విధంగా చేస్తే ప్రయోజనకరం..

ఉద్యోగంలో వచ్చే సమస్యలను వదిలించుకోవడానికి మీరు ఎల్లప్పుడూ ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మీ ప్రత్యేక సమయాల్లో కూడా చేయవచ్చు. జ్యోతిషశాస్త్రం ప్రకారం మీరు జన్మించిన నెలలో గురువారం నాడు ఆవుకు తీపిరొట్టెలు లేదా అరటిపండును తినిపించండి. ఈ విధంగా ఆ మాసంలోని అన్ని గురువారాల్లో దీన్ని చేయండి. ఈ పరిహారంతో ఉద్యోగంలో వచ్చే సమస్యలు క్రమంగా ముగియడం ప్రారంభిస్తాయి.

​ఈ పరిహారాన్ని శనివారం మాత్రమే చేయండి..

మీరు తరచుగా ఉద్యోగాలను మార్చుకోవాల్సి వస్తే లేదా సహోద్యోగులతో వాదించాలంటే మీరు శనివారం నాడు ప్రత్యేక పరిహారం పాటించాలి. ఇందుకోసం మీరు ఎవరూ వెళ్లని, జనసంచారం లేని ప్రదేశానికి వెళ్లాలి. ఆ తర్వాత ఆ ప్రదేశంలో సూర్యుడిని ఆరాధించండి. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇలా చేయడం ద్వారా మీకు ఉద్యోగం పదోన్నతులు లభిస్తాయి. అంతేకాకుండా అన్ని కష్టాలు ముగుస్తాయి. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా వాటిని అధిగమిస్తారు.

​ఈ పరిహారంతో ఉద్యోగ ప్రాప్తి..

ఉద్యోగంలో సమస్యలు తొలగించడానికి తులసికి నీటిని అందించడం సులభమైన పరిహారం. జ్యోతిషశాస్త్రం ప్రకారం తులసికి నీటిని అర్పించడం ద్వారా నీటిలో చక్కెరను కలిపి వాటిని గంగాజలంలో కలపాలి. అనంతరం ఈ సమస్యను తులసి చెట్టుకు విన్నవించండి. వీలైనంత త్వరగా దాన్ని తొలగించమని ప్రార్థించండి. ఓ వ్యక్తి క్రమం తప్పకుండా ఓ నెలపాటు ఇలా చేస్తే అతడి ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని, తులసి అనుగ్రహం పొంది ఉద్యోగం లభిస్తుందని నమ్ముతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.