యాప్నగరం

Horoscope Today ఈరోజు ఓ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు...!

horoscope today 14 August 2022 ఆదివారం రోజున సూర్యుడు కుంభ రాశి నుండి మీన రాశిలోకి సంచారం చేయనన్నాడు. ఈరోజున సర్వార్ధ సిద్ధి యోగం కూడా ఏర్పడనుంది. ఇది రాత్రి పూట కూడా కొంత సమయం ఉంటుంది. ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 14 Aug 2022, 12:30 am
horoscope today 14 August 2022 ఆదివారం రోజున సూర్యుడు కుంభ రాశి నుండి మీన రాశిలోకి సంచారం చేయనన్నాడు. ఈరోజున సర్వార్ధ సిద్ధి యోగం కూడా ఏర్పడనుంది. ఇది రాత్రి పూట కూడా కొంత సమయం ఉంటుంది. ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. కొన్ని రాశుల వారు ఈరోజు వాస్తవికంగా ఆలోచనలు చేస్తారు. ఇంకా కొన్ని రాశుల వారు ఈరోజు మీరు పెండింగులో ఉన్న పనులను మళ్లీ ప్రారంభించొచ్చు. ఈరోజు మీరు గొప్ప వ్యక్తులతో మంచి పరిచయాలను ఏర్పరచుకుంటారు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులలో ఏయే రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu horoscope today 14 august 2022 daily astrology of zodiac signs in telugu
Horoscope Today ఈరోజు ఓ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు...!


​మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు పనికి సంబంధించి విజయం సాధిస్తారు. మీకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనలు రావొచ్చు. మీరు వాస్తవికంగా ఆలోచనలు చేస్తారు. ఈరోజు మీరు పెండింగులో ఉన్న పనులను మళ్లీ ప్రారంభించొచ్చు. ఈరోజు మీరు గొప్ప వ్యక్తులతో మంచి పరిచయాలను ఏర్పరచుకుంటారు. వారు మీకు చాలా విషయాల్లో మార్గదర్శనం చేస్తారు. మీ పనిలో విజయం సాధించడానికి మీకు సమయం అనుకూలంగా ఉంటుంది.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి.

Raksha Bandhan 2022 రాఖీ ఎప్పుడు తీసేయాలి... ఆ ప్రాంతంలో ఎన్ని రోజులు రాఖీ కట్టుకుంటారంటే...!

​వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు మనసులో చాలా ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ ప్రయాణాలను ఆస్వాదిస్తారు. మీకు పనిలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఈరోజు ప్రారంభంలో మీకు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు ఎలాంటి ప్రయత్నంలో అయినా సక్సెస్ సాధిస్తారు.

ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు గోమాతకు పచ్చి గడ్డిని తినిపించాలి.

​మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీ కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఎక్కువ ఆదాయాన్ని పొందుతారు. మీ పనికి సంబంధించి కొన్ని పెద్ద మార్పులు రావొచ్చు. కాబట్టి అన్ని పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి.

ఈరోజు మీకు 80 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.

​కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు చాలా ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగులు ఈరోజు మంచి విజయాలను సాధిస్తారు. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలొస్తాయి. మీ కుటుంబ జీవితంలో ఉండే విభేదాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు మీరు శత్రువులపై విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి బయటకు వెళ్తారు.

ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు ఆంజనేయ స్వామిని ఆరాధించాలి.

​సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు పడిన కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఏదైనా శుభకార్యంలో పాల్గొంటారు. మీ మనసులో ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు పెద్దలు మరియు సజ్జనులను గౌరవించడంలో ముందుంటారు.

ఈరోజు మీకు 80 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు గురువులు లేదా సీనియర్ వ్యక్తుల ఆశీస్సులు తీసుకోవాలి.

​కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ కృషి, అవగాహన కారణంగా మీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగుల పనితీరుకు కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మంచి ప్రయాణాన్ని చేస్తారు. మీరు ఒకరితో ఒకరు మంచి సమయాన్ని గడుపుతారు.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.

foreign horoscope జ్యోతిష్యం ప్రకారం మీరు ఎప్పుడు విదేశీ పర్యటన చేస్తారంటే..

​తుల రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ మాటతీరుతో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు. మీ తెలివితేటలతో పనుల్లో విజయం సాధిస్తారు. మీరు పని చేసే రంగంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈరోజు మీకు ప్రతి రంగంలోనూ సమయం అనుకూలంగా ఉంటుంది.

ఈరోజు మీకు 72 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు మీరు శివచాలీసా పఠించాలి.

​వృశ్చిక రాశి వారి ఫలితాలు (Scorpio Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. కాబట్టి ధైర్యం కోల్పోవద్దు. రాబోయే క్లి్ష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు. దీంతో ఈరోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీరు కొన్ని శుభకార్యాల్లోనూ పాల్గొంటారు.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు మీరు తెల్లని వస్తువులను దానం చేయాలి.

​ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు పని ప్రదేశంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. అయితే మీ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. వ్యాపారులకు ఈరోజు చాలా సందర్భాల్లో మెరుగైన ఫలితాలొస్తాయి. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ సలహా ఇతరులకు మంచిగా ఉపయోగపడుతుంది. మీకు ఈరోజు ఇంటా బయట ఆనందంగా ఉంటుంది.

ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు వినాయకుడికి మోదకం సమర్పించాలి.

​మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు పనితీరులో మెరుగ్గా ఉంటుంది. మీ మాట్లాడే నైపుణ్యంతో మీరు ఏ రంగంలో అయినా రాణిస్తారు. ఈ కారణంగా మీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశం ఉంటుంది. మరోవైపు మీ మానసిక బద్ధకం ఈరోజు ముగుస్తుంది. మీకు అన్ని వైపుల నుండి శుభవార్తలు వినిపిస్తాయి.

ఈరోజు మీకు 64 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు శివ చాలీసా పఠించాలి.

​కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు చిరస్మరణీయమైన రోజుగా మిగులుతుంది. మీ మధురమైన మాటల సహాయంతో, తెలివితో మీరు చేసే పనుల్లో విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలు ఈరోజు పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ల నుండి ప్రశంసలు లభిస్తాయి. మరోవైపు ఈరోజు కొన్ని కొత్త బాధ్యతలు రావొచ్చు.

ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు సరస్వతీ దేవిని పూజించాలి.

​మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు ఉత్సాహంగా ఉంటుంది. మీ పనిలో చాలా మెరుగైన ఫలితాలొస్తాయి. విద్యార్థులు ఈరోజు పోటీ రంగంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు మీ స్నేహితులను లేదా పరిచయస్తులను కలుస్తారు. ఈ కారణంగా మీరు చాలా సంతోషిస్తారు. ఈరోజు మీ తెలివితేటలతో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు మీరు తెల్లని వస్తువులను దానం చేయాలి.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.