యాప్నగరం

Mulugu Horoscope: ఆగస్టు 11 రాశి ఫలాలు- వృశ్చిక రాశివారికి వస్తులాభం!

ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్దాంతిగారి జ్యోతిషంపై చాలా మందికి నమ్మకం. ఆయన వెల్లడించిన విషయాలు అనేక సందర్భాల్లో నిజమయ్యాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ఆయన అంచనా వేసిన విధంగా ఫలితం వచ్చింది.

Samayam Telugu 11 Aug 2019, 5:15 am
మేషం
Samayam Telugu astrology7

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

వృషభం
మిత్రుల నుంచి వ్యాపారపరంగా కీలక సమాచారం అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. స్వల్ప ధనలాభాలు ఉంటాయి.

మిథునం
ఋణ బాధలు తప్పవు. వివాదాలు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం ఉత్తమం. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటాబయటా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం
వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. వాహనాలు, గృహాలు కొనుగోలు చేస్తారు.

సింహ
సోదరుల నుంచి ధనలాభం పొందుతారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. జీవితభాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు.

కన్య
చిన్ననాటి మిత్రుల నుంచి శుభ ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

తుల
జీవితభాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సంతానం చేపట్టిన నూతన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆగోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం.

వృశ్చికం
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు సమకూరుతుంది. ఋణ బాధలు తప్పవు. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వస్తులాభాలు పొందుతారు.

ధనుస్సు
మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మకరం
ఋణబాధలు తొలగుతాయి. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభం ఉంది.

కుంభం
ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. దూరప్రాంత ప్రయాణాలలో తొందరపాటు తగదు. వివాదాలకు, అనవసర విషయాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండటం ఉత్తమం.

మీనం
ముఖ్యమైన వ్యవహారాలలో అడ్డంకులు ఎదురైనా విజయవంతంగా పూర్తిచేస్తారు. దూరప్రాంతాల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. నూతన కాంట్రాక్టులు లాభసాటిగా సాగుతాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.