యాప్నగరం

Mulugu Horoscope: డిసెంబరు 11 రాశి ఫలాలు- ఓ రాశివారికి కొత్త పరిచయాలు!

ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్దాంతిగారి జ్యోతిషంపై చాలా మందికి నమ్మకం. ఆయన వెల్లడించిన విషయాలు అనేక సందర్భాల్లో నిజమయ్యాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ఆయన అంచనా వేసిన విధంగా ఫలితం వచ్చింది.

Samayam Telugu 11 Dec 2019, 6:50 am
ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్దాంతిగారి జ్యోతిషంపై చాలా మందికి నమ్మకం. ఆయన వెల్లడించిన విషయాలు అనేక సందర్భాల్లో నిజమయ్యాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ఆయన అంచనా వేసిన విధంగా ఫలితం వచ్చింది.
Samayam Telugu mulugu daily rasi phalalu 11th december 2019
Mulugu Horoscope: డిసెంబరు 11 రాశి ఫలాలు- ఓ రాశివారికి కొత్త పరిచయాలు!


​మేష రాశి

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సన్నిహితుల సాయంతో విజయవంతంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు.

​వృషభ రాశి

మిత్రులతో ఏర్పడిన ఆర్ధిక లావాదేవీలు, వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. జీవితభాగస్వామి నుంచి ధనలాభాలు పొందుతారు.

​మిథున రాశి

నూతన పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనలాభాలు పొందుతారు.

​కర్కాటక రాశి

పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తువులు, వాహనాలు, వస్త్రాభరణాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి.

​సింహ రాశి

మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వస్తులాభాలు ఉంటాయి.

కన్య రాశి

శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. జీవితభాగస్వామితో చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం పొందుతారు.

​తుల రాశి

Read Also: డిసెంబరు 11 బుధవారం.. తిథి మార్గశిర పౌర్ణమి, నక్షత్రం

చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి.

వృశ్చిక రాశి

చేపట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. దూర ప్రయాణాలలో తొందరపాటు తగదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

​ధనుస్సు రాశి

మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. దీర్ఘకాలిక ఋణాలు కొంత వరకు తీరుతాయి. ఉద్యోగులకు స్థానమార్పులు ఉంటాయి. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి.

​మకర రాశి

బంధువుల నుంచిి విలువైన సమాచారం అందుకుంటారు. ఆదాయం పెరిగినా దానికి తగ్గట్టు ఖర్చులు కూడా పెరుగుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కుంభ రాశి

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. జీవితభాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

​మీన రాశి

ఆర్థికపరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.