యాప్నగరం

Mulugu Horoscope: మే 12 రాశి ఫలాలు- ఓ రాశివారికి ధనలాభం!

ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్దాంతిగారి జ్యోతిషంపై చాలా మందికి నమ్మకం. ఆయన వెల్లడించిన విషయాలు అనేక సందర్భాల్లో నిజమయ్యాయి. ఇటీవల పలు ఎన్నికల్లోనూ ఆయన అంచనా వేసిన విధంగా ఫలితం వచ్చింది.

Samayam Telugu 12 May 2019, 7:24 am
మేషం
Samayam Telugu astrology2

వృత్తి-వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సోదరుల నుంచి సాయం అందుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. స్వల్ప ధనలాభం పొందుతారు.

వృషభం
దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. కొత్త పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తిచేస్తారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ధనలాభం ఉంది.

మిథునం
మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఎంతటి కార్యానైనా పూర్తిచేస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు.

కర్కాటకం
చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తిచేస్తారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

సింహ
మీ ప్రతిభ వెలుగు చూస్తుంది. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. దూరప్రాంతం నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ధనలాభం ఉంది.

కన్య
మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.

తుల
వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. కొత్తపనులకు శ్రీకారం చుడతారు.

వృశ్చికం
దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు
నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పరుస్తాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

మకరం
దీర్ఘకాలిక రుణాలు చికాకు పరుస్తాయి. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

కుంభం
బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. పనులలో విజయం సాధిస్తారు. జీవితభాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

మీనం
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఋణ ఒత్తిడులు తప్పవు. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.