యాప్నగరం

Mulugu Horoscope: మే 13 రాశి ఫలాలు- ఓ రాశివారికి వాహనయోగం!

శ్రీకాళహస్తి దేవస్థాన పండితుడిగానూ, ఖగోళ, వాస్తు శాస్త్రాల్లో నిష్ణాతుడిగానూ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారికి విశేష ఆదరణ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయన జ్యోతిషంపై అపారమైన నమ్మకం.

Samayam Telugu 13 May 2019, 7:21 am
మేషం
Samayam Telugu astrology3

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

వృషభం
ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. స్వల్ప ధనలాభం ఉంది.

మిథునం
ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి-వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల నుంచి సాయం పొందుతారు. వాహనయోగం ఉంది.

కర్కాటకం
విందువినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సంతాన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనలాభాలు ఉన్నాయి.

సింహ
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. గృహాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వస్తులాభాలు.

కన్య
చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సోదరులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ధనలాభం ఉంది.

తుల
ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఋణ బాధలు తప్పవు. సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలలో జాప్యం జరిగినా నిదానంగా ఫలిస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి.

వృశ్చికం
ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకోని విధంగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. జీవితభాగస్వామి సహాయసహకారాలు అందుకుంటారు.

ధనుస్సు
వృత్తి-వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఋణాలు కొంతవరకు తీరుస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.

మకరం
నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు.

కుంభం
జీవితభాగస్వామి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు.

మీనం
దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.